• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోది కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాల్లాగే కుమ్మక్కు అవార్డులు.!మిషన్ భగీరథ అవార్డు బోగస్:కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మిషన్ భగీరథకు జాతీయ అవార్డు వచ్చిందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యుడు బక్క జడ్సన్.అవార్డు బాగోతం అంతా సీఎం చంద్రశేఖర్ రావు ప్రధాని మోది కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని స్పష్టం చేసారు. మిషన్ భగీరథ అక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి కేటీర్, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ఏఐసిసి సభ్యుడు బక్క జడ్సన్ సవాల్ విసిరారు.

మేడ్చల్ జిల్లాలో, ఘట్కేసర్ మండలం, అవుషాపూర్ గ్రామం మిషన్ భగీరథ నీళ్ల పైపులు పరిశీలిస్తే, అక్కడ రెండు ట్యాంకులు కాంగ్రెస్ హయాంలో వేసినవని, ఒక కోటీ ముప్పై లక్షల రూపాయల బిల్లులను కొత్త పైపులు వేశామని తీసుకున్నారని ఆరోపించారు.

 మిషన్ భగీరథ తప్పుల తడక..

మిషన్ భగీరథ తప్పుల తడక..

తెలంగాణలో మిషన్ భగీరధలో జరిగిన దోపిడీ పై కేంద్ర కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ లో ఫిర్యాదు చేపినట్టు జడ్సన్ తెలిపారు. జలజీవన్ కమిషన్ సర్వే ఆధారంగా, మిషన్ భగీరద లో జరిగిన కుంభకోణం పై కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖలో ఫిర్యాదు చసామన్నారు.

ఢిల్లీలోని శాస్త్రి భవన్లో దర్యాప్తు అధికారి నియామకం జరిగిందన్నారు. తెలంగాణలో ప్రభుత్వం 100% మిషన్ భగీరధ అమలు అయందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్ పార్లమెంట్ లో కితబు ఇచ్చాడని, కాని కేంద్ర జలజీవన్ కమీషన్ తన సర్వే లో 2011 జనాభా లెక్కల ప్రకారం 83,03,612 ఇళ్లు ఉంటే ఇప్పుడు 89,49,169 ఇళ్లు ఉన్నాయన్నారు.

మోదీ కేసీఆర్ కుమ్ముక్కు రాజకీయాలు..

మోదీ కేసీఆర్ కుమ్ముక్కు రాజకీయాలు..

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 2.72 కోట్ల మందికి కృష్ణ, గోదావరి జలాలు అందిస్తానని చెప్పి 2.12 కోట్ల మందికి మాత్రమే నీళ్లు ఇచ్చాడని సర్వే తేల్చిందన్నారు. 60% పాత వాటర్ ట్యాంకులు, పైపుల ద్వారా బోర్ నీళ్లుతో భగీరథ నీళ్లు కలిపి పంపిణి చేస్తున్నారని, దీని ద్వారా నీళ్లలో కానిజాలు 500% వరకు పెరుగుతున్నాయనన్నారు. నిర్మల్ జిల్లా పెంబి, మామడ, లోకేశ్వరం మండలంలోని తండాలలో నివసిస్తున్న నిరుపేదలు ఇప్పటికి బావి నీళ్లు తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కామారెడ్డి జిల్లా గాంధారి, దోమకొండ, బిక్కనూరు, తాడ్వాయి, సదాశివైనగర్ మండలాలతో పాటు కరీంనగర్ లో త్రాగునీరు కరువైందన్నారు జడ్సన్.

కొన్ని జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు..

అలాగే 70% ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మిషన్ భగీరథ నీళ్ళు సరఫరా కావడంలేదని, మరి 100% తాగు నీళ్లు సరఫరా చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ఎలా ప్రకటించిందని జడ్సన్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఎలా సమర్థిస్తాడని విరుచుకుపడ్డారు. 12000 కోట్ల రూపాయలను కేవలం మెగా కృష్ణ రెడ్డి ఎగ్గొట్టాడని, ఐనప్పటికి తెలంగాణ పథకానికి జాతీయ అవార్డు ఇవ్వడం మోడీ, చంద్రశేఖర్ రావు కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.

వాస్తవాలు ఆవిష్కరిస్తాను..

వాస్తవాలు ఆవిష్కరిస్తాను..

అవుషాపూర్ లో మిషన్ భగీరథ అక్రమాలపై బహిరంగ చర్చ కు మంత్రి కేటీర్, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రావాలని బక్క జడ్సన్ డిమాండ్ చేసారు. మిషన్ భగీరథ ప్రాంతాలను సందర్శించిన వారిలో అసంఘటిత కార్మిక కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, వార్డ్ మెంబెర్ వెంకట్ రెడ్డి, స్థానికులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో మిషన్ భగీరథ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయని ప్రభుత్వం తెలంగణ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందన్నారు బక్క జడ్సన్.

English summary
Ministers Errabelli Dayakar Rao and Harish Rao statement is ridiculous that Mission Bhagiratha got a national award. AICC member Bakka Judson of the Congress party said that the award was a proof of the collusive politics of CM Chandrasekhar Rao and Prime Minister Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X