వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాస్ లు దుర్వినియోగం చేస్తే పాస్ క్యాన్సిల్ తో పాటు వెహికల్ సీజ్ ... పోలీస్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. పెరుగుతున్న కేసుల నేపధ్యంలో మే 7వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ తెలంగాణా సర్కార్ నిర్ణయం తీసుకుంది . హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ అమలు కొనసాగుతుంది. అయితే కొన్ని చోట్ల లాక్ డౌన్ నిబంధనలను గుర్తించిన హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ మరింత కఠినం గా లాక్ డౌన్ అమలు చేస్తామని చెప్తున్నారు . ఇప్పటివరకు 49,863 వాహనాలపై కేసులు బుక్ చేసామని 69,288 వాహనాలు సీజ్ చేసామని అన్నారు. నేటి నుండి లా అండ్ ఆర్డర్ మరింత కఠినంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.

లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం

లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం

కొన్ని చోట్ల సోషల్‌ డిస్టెన్స్‌ సరిగా పాటించటం లేదని హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో జనాలు అనవసరంగా రోడ్లమీదకు వస్తున్నారని పేర్కొన్నారు. ఇక అలాంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు . లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసినప్పుడే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందని సీపీ అంజనీ కుమార్ అభిప్రాయపడ్డారు . ఇక లాక్ డౌన్ పొడిగించిన నేపధ్యంలో లాక్ డౌన్ అమలుపై పోలీస్ ఉన్నతాధికారులు చర్చించామని చెప్పిన ఆయన మరింత స్ట్రిక్ట్ గా నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

ఆన్లైన్ ఫుడ్ ఐటమ్ సప్లై చేసే సంస్థలపై ఆంక్షలు

ఆన్లైన్ ఫుడ్ ఐటమ్ సప్లై చేసే సంస్థలపై ఆంక్షలు

ఇక స్విగ్గీ లో పని చేసే డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన నేపధ్యంలో ఆన్లైన్ ఫుడ్ ఐటమ్ సప్లై చేసే సంస్థలపై ఆంక్షలు ఉన్నాయన్న ఆయన ఎవరైనా అతిక్రమించి రోడ్డు మీదకు వస్తే కేసులు బుక్ చేసి వాహనాలు సీజ్ చేస్తామని అన్నారు. ఇక హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 12 వేల మంది పోలీసులు ఈ లాక్ డౌన్ డ్యూటీ లో ఉన్నారని, సున్నితమైన ప్రాంతల్లో డ్యూటీ చేసే వారికి కావాల్సిన పీపీఈ కిట్స్ ఇచ్చామని అన్నారు. ఇక ప్రజలు ఎవరూ పాసుల కోసం కమీషనర్ ఆఫీసుకు రావద్దని పేర్కొన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ .

పాసులు మిస్ యూజ్ చేస్తే వాహనం సీజ్

పాసులు మిస్ యూజ్ చేస్తే వాహనం సీజ్


పాస్ లు పొందటం కోసం ఐటీ సెల్ తరపున నుండి ఓ పోర్టల్ ను ప్రారభించామని దాని ద్వారా అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు . కలర్ మాత్రమే కాదు బ్లాక్ అండ్ వైట్ పాస్ కూడా అనుమతించబడతాయని పేర్కొన్నారు. అన్ని మతాల వారు పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో రంజాన్ మాసం ఆరంభం కాబోతుంది కాబట్టి ముస్లింలు సామూహిక ప్రార్ధనలకు దూరంగా ఉండాలని చెప్పారు . ఇక పాసులు తీసుకున్న వాళ్ళు పాస్ మిస్ యూజ్ చేస్తే తక్షణం పాసులను కాన్సిల్ చేసి వాహనాలు సీజ్ చేస్తామని అన్నారు.

Recommended Video

Fake News Buster EP 10 : సోడియం హైపోక్లోరైట్ మనుషులు వాడచ్చా ?

English summary
Hyderabad CP Anjani Kumar said that none of the people should come to the commissioner's office for passes. He suggested that a portal was opened on behalf of the IT cell to get passes through it. Not only the color but the black and white pass are also allowed. All religions suggest that they celebrate festivals at home. Those who take the passes will misuse the pass to immediately cancel the passes and seize the vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X