వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

54 రోజుల ఆందోళన: తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్ళిన సంగీత, లైవ్ లో చూసిన భర్త

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:కోర్టు అనుమతి కారణంగా తన అత్తింట్లోకి తాళం పగులగొట్టి సంగీత వెళ్ళారు. కానీ, కోర్టు తీర్పు తర్వాత తనకు అత్తింటి నుండి తనకు ఎలాంటి హమీలు రాలేదని సంగీత చెప్పారు.సంగీతకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచారు.గురువారం సాయంత్రం శ్రీనివాస్ రెడ్డి ఇంటి తలుపులు పగులగొట్టి సంగీత ఇంట్లోకి వెళ్ళారు.

తనతో పాటు తన కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైద్రాబాద్‌లోని బోడుప్పల్‌లో అత్తింటి వద్ద 54 రోజులుగా ఆందోళన చేస్తోంది. సంగీత ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు ఇంతవరకు ఆమెకు ఎలాంటి హమీ ఇవ్వలేదని సంగీత చెబుతున్నారు.

తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సంగీత కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈ విషయమై గురువారం నాడు కీలకమైన తీర్పు ఇచ్చింది. సంగీతను అత్తింట్లోనే ఉంచుతూ నెలకు రూ.20 వేలను చెల్లించాలని మియాపూర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత సంగీత ఇంటి తాళం విరగ్గొట్టి లోపలికి వెళ్ళింది.

54 రోజుల తర్వాత ఇంట్లోకి సంగీత

54 రోజుల తర్వాత ఇంట్లోకి సంగీత

54 రోజుల ఆందోళన తర్వాత సంగీత శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు.54 రోజులుగా ఇదే ఇంటి ఎదుట సంగీత ఆందోళన చేసింది.మియాపూర్ కోర్టు తీర్పు రావడంతో సంగీత మహిళా సంఘాల సహయంతో ఇంట్లోకి ప్రవేశించింది.

జాడలేని నేతలు: సంగీత ఆమరణ దీక్ష విరమణ, ధర్నా కొనసాగింపుజాడలేని నేతలు: సంగీత ఆమరణ దీక్ష విరమణ, ధర్నా కొనసాగింపు

శ్రీనివాస్ రెడ్డి నుండి ఎలాంటి హమీ రాలేదు

శ్రీనివాస్ రెడ్డి నుండి ఎలాంటి హమీ రాలేదు

తన భర్త శ్రీనివాస్ రెడ్డి నుండి ఎలాంటి హమీ రాలేదని సంగీత ప్రకటించారు. కోర్టు తీర్పు తర్వాత తానే తన భర్త శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వనించానని సంగీత చెప్పారు. ఇద్దరం కలిసి పాపను తీసుకొని ఇంట్లోకి వెళ్ధామని తాను కోరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కానీ, శ్రీనివాస్ రెడ్డి నుండి తనకు ఎలాంటి హమీ రాలేదని సంగీత చెప్పారు.

పాపపై ప్రేమ ఉందన్నారు. కానీ హమీ లేదు

పాపపై ప్రేమ ఉందన్నారు. కానీ హమీ లేదు

తన కూతురిపై ప్రేమ ఉందని శ్రీనివాస్ రెడ్డి మీడియా సాక్షిగా చెబుతున్నారని సంగీత చెప్పారు,. కానీ, తన కూతురు కోసం ఏం చేస్తారనే విషయాన్ని మాత్రం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేయడం లేదని సంగీత చెప్పారు.తన పాపపై ప్రేమ ఉందనే విషయాన్ని నోటీ మాటగా చెబితే ప్రయోజనం లేదు, ఆచరణలో చూపాలని సంగీత చెప్పారు.

లైవ్ లో చూసిన భర్త

లైవ్ లో చూసిన భర్త

మియాపూర్ కోర్టు తీర్పు విషయమై శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయమై తనకు తన అత్తింటి నుండి ఎలాంటి హమీ రాలేదని సంగీత తేల్చి చెప్పారు. పలువురు అధికారులు సంగీత ఇంటికెళ్లి ఆమెను ఇంట్లోకి పంపారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఆ తాళాలను సుత్తి సాయంతో సంగీత స్వయంగా పగులకొట్టింది. ఆ సమయంలో శ్రీనివాస రెడ్డి ఓ టీవీ చానెల్ లైవ్‌లో మాట్లాడుతూ ఈ దృశ్యాలను చూశారు.

English summary
Sangeetha entered in to Srinivas Reddy's house as per the Miyapur court directions on thursday evening.from the past 54 days Sangeetha protesting in front of Srinivas Reddy's house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X