హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మియాపూర్ భారీ స్కాం: ఇంద్రాణితో పాటు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పరార్

మియాపూర్ భూకుంభకోణం కేసులో నిందితులకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మియాపూర్ భూకుంభకోణం కేసులో నిందితులకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కుటుంబంతో సహా గోల్డ్ స్టోన్ ప్రసాద్ పరార్

మియాపూర్ లో వెలుగుచూసిన భూకుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ హస్తం ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయన కుటుంబంతో సహా పరారయ్యాడు.

మియాపూర్‌లో రూ.10వేలకోట్ల భారీ భూకుంభకోణం, 'పెద్దలు' ఉన్నారా? మియాపూర్‌లో రూ.10వేలకోట్ల భారీ భూకుంభకోణం, 'పెద్దలు' ఉన్నారా?

ప్రసాద్ ఆచూకీ లభ్యం కాకపోవడం, ఆయనతో సహా ఆయన కుటుంబీకుల ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

Miyapur land scam: Prasad and Co may have Rs 40 crores illegal land

ఆయన ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు ఓ అధికారి తెలిపారు. ఈ కేసులో భాగంగా ప్రసాద్, ఆయన భార్య ఇంద్రాణి, కోడలు మమతలపై కేసులు నమోదు చేశారు.

వారు వెంటనే పోలీసుల ముందుకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రసాద్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఎల్బీనగర్, మైలార్ దేవ్ పల్లి, బాలానగర్ ప్రాంతాల్లో జరిగిన భూముల క్రయ విక్రయాల్లో అవకతవకలు జరిగాయని, వాటి వెనుక ప్రసాద్ హస్తం ఉన్నట్టు సాక్ష్యాలు లభించాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇక ఆయన విదేశాలకు పారిపోకుండా నేడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.

English summary
Businessman from city who was involved in major investment scams in US, is suspected to be the man behind the scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X