వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం బాలయ్య పిలుపు .. రక్తదానం ప్రాణదానం అంటూ

|
Google Oneindia TeluguNews

హిందూపురం ఎమ్మెల్యే,సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కరోనా కష్టకాలంలో ప్రజల కోసం నేను సైతం అంటూ తన గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. ఇప్పుడు తలసేమియా బాధితుల కోసం తన వంతు సాయం అందించాలని రంగంలోకి దిగారు. రక్తదానం చేసి తలసేమియా రోగుల ప్రాణాలు కాపాడాలని కోరారు.

కోవిడ్ ఆస్పత్రికి భారీ విరాళం ఇచ్చిన బాలకృష్ణ .. హిందూపురం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం బాలయ్య ఔదార్యంకోవిడ్ ఆస్పత్రికి భారీ విరాళం ఇచ్చిన బాలకృష్ణ .. హిందూపురం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం బాలయ్య ఔదార్యం

 తలసేమియా బాధితులకు రక్త కొరత

తలసేమియా బాధితులకు రక్త కొరత

కరోనా మహమ్మారి కారణంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉన్న తలసేమియా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తలసేమియా రోగులకు రక్తం నిరంతరంగా మార్పిడి చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కరోనా కారణంగా వారికి కావలసిన బ్లడ్ లేక తీవ్ర కొరత ఏర్పడింది . ఇక బ్లడ్ బ్యాంక్ లో ఉన్న రక్త నిల్వలు బాగా తగ్గిపోవడంతో వారికి చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇటీవల చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.

 చిరంజీవి పిలుపుతో పలువురు రక్త దానం .. ఇప్పుడు బాలయ్య కూడా

చిరంజీవి పిలుపుతో పలువురు రక్త దానం .. ఇప్పుడు బాలయ్య కూడా

చిరంజీవి ఇచ్చిన పిలుపు మేరకు చిరంజీవితో పాటు చాలా మంది ప్రముఖులు చిరంజీవి బ్లడ్ బ్యాంకు కి వెళ్లి రక్తదానం చేశారు. తాజాగా తలసేమియా బాధితుల కోసం బాలయ్య కూడా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. నందమూరి బాలకృష్ణ నటనలోనూ, రాజకీయాల్లోనూ మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ తనదైన శైలిలో ముందుకు వెళుతుంటారు. కరోనా లాక్ డౌన్ సమయంలో హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన బాలయ్య, ఆసుపత్రుల మౌలిక వసతుల కల్పనకు పలుమార్లు డొనేషన్ ఇచ్చారు.

 అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి రోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు

అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి రోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు

ఇక తాజాగా కరోనా ప్రభావం తో తీవ్రత కొరతతో ఇబ్బంది పడుతున్న తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. బసవతారకం హాస్పిటల్ లో ఎంత మంది క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించడానికి తన వంతు సహకారం అందిస్తున్న బాలకృష్ణ అక్టోబరు రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం తెలంగాణ తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి వచ్చి రక్తదానం చేయాలని కోరారు.

Recommended Video

Amaravati Land Issue : Chandrababu కు సవాల్ విసిరిన MLA Roja || Oneindia Telugu
అభిమానులు , పార్టీ కార్యకర్తలకు పిలుపు

అభిమానులు , పార్టీ కార్యకర్తలకు పిలుపు

తలసేమియా వ్యాధి గ్రస్తులు రక్త కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి రక్తదానం చేసి ప్రాణదానం చేయాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తలసేమియా వ్యాధి గురించి వివరించిన బాలకృష్ణ ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదంటూ, తోటి వారి ప్రాణాలను కాపాడడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రక్తదానం చేయడం అంటూ పేర్కొన్నారు. తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అందరూ, ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి అని బాలయ్య పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడండి అంటూ బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.

English summary
On the occasion of Gandhi Jayanti on October 2, Balakrishna called to donate blood in the blood donation camp organized in collaboration Telangana Telugu youth with the NTR Trust for the victims of thalassemia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X