వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీకి వీడుకోలు సమావేశం, కంటతడి పెట్టిన ఎమ్మెల్యే గండ్ర

|
Google Oneindia TeluguNews

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాలు ఒకపార్టీలో ఉండీ ఆపార్టీ ద్వార అభివృద్ది చెందిన నాయకులు పార్టీని వీడడం కష్టతరమే అవుతోంది. అయితే అవసరాలు, నాయకులను ప్రజలను మార్చుతాయనడంలో సందేహం లేదు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించి, పార్టీనే నమ్ముకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కి సైతం ఇదే పరిస్థితి ఎదురైంది.

కార్యకర్తల సమావేశంలో కంటతడి

కార్యకర్తల సమావేశంలో కంటతడి

కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన గండ్ర నేడు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశామయ్యారు. ఈ నేపథ్యంలోనే పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో కార్యకర్తలకు చెబుతున్న సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పలువురు ఇతర పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడడంతోపాటు అభివృద్ది సాధించడం కోసం టీఆర్ఎస్ చేరుతున్నట్టు ఆయన వివరించారు.

ప్రతిపక్షంలో ఉండి అవమానాలు,

ప్రతిపక్షంలో ఉండి అవమానాలు,

మరోవైపు ప్రతిపక్షంలో ఉండి అవమానాలు భరించలేకే తాను టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా గండ్ర తెలిపారు. ఈనేపథ్యంలోనే తనపై విమర్శలు చేసే వారికి సరైన సమాధానం చెబుతానని అన్నారు. మాటలు చెప్పే వారికి తన పనితో సమాధానం చెబుతానని తెలిపారు.

సోమవారం కేటీఆర్ ను కలిసిన గండ్ర దంపతులు,

సోమవారం కేటీఆర్ ను కలిసిన గండ్ర దంపతులు,


కాంగ్రెస్ పార్టీలో ఉంటానని స్పష్టం చేసిన గండ్ర సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను గండ్రర దంపతులు కలిశారు. అనంతరం నేడు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారితో భేటి అయ్యారు. కాగా ఇప్పటికే అక్కడ మాజీ స్పికర్ మధుసూదన చారీ ఓటమి పాలయిన నేపథ్యంలో అక్కడ తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నలు చేస్తున్నారు.

English summary
Congress mla gandra venkata ramana reddy break down, who is going to join trs party from congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X