వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వరం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు... హారీష్ రావు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు నేడు ప్రారంభోత్సవం అవుతున్న సందర్భంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.... ప్రాజెక్టు ప్రారంభోత్సవం పై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. గోదావరి నీళ్ళను తెలంగాణ భూములకు మల్లే విధంగా ప్రజలు చేసిన పోరాట ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు అని పేర్కోన్నారు.

బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టెదెవ‌రు..? మంత్రి వర్గ విస్ధరణలో హరీష్ చోటు పై ఉత్కంఠ..!! బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టెదెవ‌రు..? మంత్రి వర్గ విస్ధరణలో హరీష్ చోటు పై ఉత్కంఠ..!!

Recommended Video

కాళేశ్వరంలో "మెఘా" పంపులు
కేసీఆర్ అహర్నిషలు కృషి చేశారు.

కేసీఆర్ అహర్నిషలు కృషి చేశారు.

మరోవైపు తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంతోపాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషి వల్లే ప్రాజెక్టు సాకారమైందని అన్నారు. ఆనాటి సమైక్య పాలకులు
ప్రాజెక్టులను వివాదాల్లో చిక్కుకునే విధంగా డిజైన్ చేసి, నీటి లభ్యత లేని ప్రాంతాల్లో
ప్రాజెక్టులు నిర్మించేందుకు కుట్రపన్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసిఆర్ అపరభగీరథుడిలా తానే ఒక ఇంజనీర్ గా అవతారమెత్తి అహోరాత్రులు శ్రమించి, ప్రాజెక్టులకు రీ డిజైన్ చేశారని ఆయన అన్నారు...

మహారాష్ట్ర్రతో స్నేహపూర్వక సంబంధాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయింది..

మహారాష్ట్ర్రతో స్నేహపూర్వక సంబంధాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయింది..

ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర తో ఉన్న విభేదాలను, స్నేహపూర్వక సంబంధాలతో పరిష్కరించుకుని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే దక్కుతుందని ప్రశంసించారు. ఈ సంధర్భంగా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన ఇంజనీర్లతో పాటు అధికారులు, కూలీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

గత ప్రభుత్వంలో మంత్రిగా కాళేశ్వరంపై ఫోకస్ పెట్టిన హారీష్ రావు

గత ప్రభుత్వంలో మంత్రిగా కాళేశ్వరంపై ఫోకస్ పెట్టిన హారీష్ రావు

ప్రభుత్వం భావిస్తున్నట్టుగా బంగారు తెలంగాణ లో భాగంగా సస్యశ్యామల తెలంగాణ కావాలని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు కాగా అప్పటి మంత్రి వర్గంలో నీటి పారుదల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలుసార్లు సందర్శించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అటు కేటీఆర్‌తో పాటు హరీష్‌రావుకు సైతం మొదటీసారి మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించని విషయం తెలిసిందే...

English summary
Telangana government's ambitious Kaleshwaram project inaugurated today, part of this movement MLA Harish Rao congratulated the people of the state and MLA Harish Rao congratulated the people and He shared his views with the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X