వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్మికులు కాళ్లు కాదు... పీకలు పట్టుకుంటారు : జగ్గారెడ్డి

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనప్పుడు మద్దతు ఎలా ఇస్తుందని ఆయన ఎద్దెవా చేశారు. మంత్రులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్ష పార్టీలంటూ విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక కార్మీకులు ఎవరి కాళ్లు పట్టుకోరని, నేరుగా పీకలు పట్టుకుంటారని అన్నారు.

 రాసిచ్చిన స్క్రిప్టులేనా.. మంత్రుల సేమ్ డైలాగ్స్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..! రాసిచ్చిన స్క్రిప్టులేనా.. మంత్రుల సేమ్ డైలాగ్స్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..!

రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్జీసీ సమ్మెతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ద పెరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలోని విపక్షపార్టీలన్ని కార్మికులకు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆర్టీసీ సమ్మె వెనక విపక్ష పార్టీలు ఉన్నాయంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్షల ప్రయోజనాలు పోందడంతోపాటు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే ఆర్టీసీ కార్మీకులను వాడుకుంటున్నారని, రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావులు పలు ఆరోపణలు చేశారు. దీంతో జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేవని ముఖ్యమంత్రి నేరుగా చెప్పినప్పుడు మద్దతు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

 MLA Jagga Reddy reacted the governments criticism of the RTC strike.

కాగా ఆర్టీసీ కార్మికుల పోరాటం తోమ్మిదో రోజు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టి సమ్మెను మరింత ఉదృతం చేశారు. దీంతో సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కూడ ప్రయత్నలు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులు కూడ సమ్మెపై ప్రకటన చేశారు. కార్మికుల వెనక తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఉన్నాయని అన్నారు. కార్మికులు రాజకీయ పార్టీలను పక్కన పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు. మొత్తం మీద ఆర్టీసీ సమ్మెను ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు మంత్రులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అటాక్ చేస్తున్నట్టు సమాచారం.

English summary
Congress MLA Jagga Reddy reacted the government's criticism of the RTC strike. He also expressed how support would be provided when there is no opposition in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X