వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే సీఎం... రాజగోపాల్ కామెంట్స్ రివర్స్.. బీజేపీ ఎంట్రీ లేనట్లేనా ?

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని అన్న నానుడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో నిజమని మరోసారి నిరూపణ అయ్యోట్టు కనిపిస్తోంది. బీజేపీలో చేరే అవకాశాన్ని వాడుకోకుండా నోటి దురుసుతో, తానే భవిష్యత్ సీఎం అవుతానంటూ ఆయన చేసిన కామెంట్స్ , అయన రాజకీయ భవిష్యత్‌కు ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితులు కనిపిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలతో రెండికి చెడ్డ రేవడిలా ఆయన రాజకీయ భవిష్యత్ తయారైంది.

నోటి దురుసుతోనే అవకాశాలు వెనక్కి...?

నోటి దురుసుతోనే అవకాశాలు వెనక్కి...?

ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోటి దురుసు ఆయన రాజకీయ భవిష్యత్ పై ప్రభావం పడ్డాయా ? ఓ వైపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో పాటు స్థానికల నేతలపై దుమ్మెత్తి పోస్తున్న రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలోకి చేరుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇందుకోసం పార్టీ నాయకులతో మంతనాలు కూడ జరిపాడు. అయితే బీజేపీలో చేరకుందే ఆయన కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో బీజేపిలోకి చేర్చుకునే ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడింది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీలో చేరకుండా.. ఇటు కాంగ్రెస్‌లో ఇముడలేక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఆడ కత్తేరలో పోకచెక్కాల తయారైందని పలువురు భావిస్తున్నారు.

బీజేపీకే రాజకీయ భవిష్యత్

బీజేపీకే రాజకీయ భవిష్యత్


ఎమ్మెల్సీగా ఉన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికైనప్పటి నుండి ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోపాటు స్థానిక నాయకత్వానికి సవాల్ విసిరాడు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని బహిరంగానే ప్రకటించాడు.మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పై కూడ పలు ఆరోపణలు చేశాడు. ఉత్తమ్ లేకుంగా ఉంటే మరో ఎంపీ స్థానాలకు కూడ గెలపోందేవారమని అన్నారు. విమర్శలతో బీజేపీలోకి చేరేందుకు స్కెచ్ వేశాడు.

పార్టీ మారుతున్నట్టు సంకేతాలు

పార్టీ మారుతున్నట్టు సంకేతాలు

ఓవైపు కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెడుతూనే మరోవైపు బీజేపీలో చేరేందుకు పావులు కదిపారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన విమర్శలు చేసిన రాజగోపాల్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో సమావేశం అయినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆయన బిజేపీలో చేరతారనే ప్రచారం ఖాయంగా మారింది. ఇక ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసిన అనంతరం స్థానికంగా నియోజక వర్గంలోని పార్టీ నేతలతో సమావేశం కూడ అయ్యాడు.తనతో ఎవరు వచ్చినా రాకున్నా తాను పార్టీ మారుతున్నాననే సంకేతాలను కార్యకర్తలకు ఇచ్చాడు.

 తానే భవిష్యత్ సీఎం అంటూ వ్యాఖ్యలు

తానే భవిష్యత్ సీఎం అంటూ వ్యాఖ్యలు

అయితే ఇదంతా భాగానే ఉన్న నేపథ్యంలోనే బీజేపీలోకి చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్న రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరినట్లయితే భవిష్యత్ సీఎం తానే అని కార్యకర్తలతో చెప్పాడు. అయితే ఇది అంతర్గతంగా జరిగిన సమావేశం అయినా... ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం

స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం

పార్టీలో చేరక ముందే తానే సీఎం అనే వ్యాఖ్యలు బీజేపీ నేతల క్రమశిక్షణకు అడ్డువచ్చాయి. పార్టీలో చేరకముందే ఇలాంటీ వ్యాఖ్యలు చేయడం ద్వార బీజేపీ నేతలు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన చేరికను రాష్ట్ర బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే రాజగోపాల్ రెడ్డి చేరికపై పార్టీ హైకమాండ్ సుముఖంగా ఉన్నా ఆయన వ్యాఖ్యలు స్థానిక బీజేపీ నేతలకు అగ్రహాన్ని తెప్పించడంతో, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినా ఆయన సమక్షమంలో పార్టీలో చేరేందుకు మాత్రం అవకాశం రాలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి కాస్త సైలంట్ అయ్యాడు. ఆయన మాటల దాడితో అటు కాంగ్రెస్ పార్టీలో ఉండలేక ఇటు బీజేపీలో చేరలేక రెండికి చెడ్డ రేవడిలా తయారైందని పలువురు రాజీకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Munugodu congress mla komatireddy rajagpoal reddy has in self goal.when he comment on cm was reflected his political life. though he could not join the bjp because of his own comments on bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X