• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ సర్కార్ వారి పాటలో మంచిధరలు పలికిన రాజ్యసభసీట్లు: ఎమ్మెల్యే రఘునందన్ రావు టార్గెట్

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ రేసులో పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది నేతల పేర్లు బయటకు వచ్చినా ఊహించని విధంగా ముగ్గురు పారిశ్రామికవేత్తలను పెద్దల సభకు ఎంపిక చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. హెటిరో గ్రూపు బండి పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎంపీ దామోదర్ రావు, గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర ను రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేయడం తెలంగాణ రాష్ట్రంలో కొత్త చర్చకు కారణమైంది. ప్రతిపక్ష పార్టీల రచ్చకు వేదిక అయింది.

చేరికల కోసం పోటీపడుతున్న తెలంగాణా రాజకీయ పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరివ్యూహం వారిదే!!చేరికల కోసం పోటీపడుతున్న తెలంగాణా రాజకీయ పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరివ్యూహం వారిదే!!

 ముగ్గురు వ్యాపార వేత్తలకు రాజ్యసభ సీట్లు ఇవ్వటంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత

ముగ్గురు వ్యాపార వేత్తలకు రాజ్యసభ సీట్లు ఇవ్వటంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత

రాజ్యసభకు ముగ్గురు వ్యాపారవేత్తలను ఎంపిక చేయడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మూడు సీట్లలో 2 ఓసి, 1 బిసికి ఇచ్చిన కేసీఆర్ బీసీ లలోనూ ఆర్దికంగా బలవంతుడైన వద్దిరాజు రవిచంద్ర అవకాశం కల్పించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హెటిరో సంస్థలో దాడులు చేసి ఐటీ అధికారులు వంద కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సదరు సంస్థ అధినేత అయిన బండి పార్థసారథి రెడ్డి కి రాజ్యసభ సీటు ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర ప్రజలలో చర్చనీయాంశమైంది. కేసీఆర్ కు డబ్బు కావాలి అందుకే పారిశ్రామిక వేత్తలను పెద్దల సభకు పంపిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది.

సీఎం కేసీఆర్ బడా పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ సీట్లు.. ఆర్ధిక వనరుల కోసమేనా?

సీఎం కేసీఆర్ బడా పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ సీట్లు.. ఆర్ధిక వనరుల కోసమేనా?


మన రాష్ట్రం నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించేందుకు సామాన్యులు, తెలంగాణ ఉద్యమంలో పార్టీ కోసం కీలకంగా పనిచేసిన వారు, సబ్జెక్టు ఉన్న నేతలు ఇంకా ఎవరూ లేరా అన్న చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ బడా పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ సీట్లు ఆఫర్ చేసి భారీగా ఆర్థిక వనరులను పోగు చేసుకుంటున్నారు అన్న చర్చ ప్రతిపక్ష పార్టీలలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే రెండు దఫాలు తెలంగాణాలో అధికారం కట్టబెట్టిన ప్రజలు మూడో సారి అధికారం ఇస్తారా లేదా అన్న సంశయంలో ఉన్న కేసీఆర్ వచ్చే ఎన్నికలకు ఆర్ధిక వనరులతో ప్రతిపక్షాలకు దెబ్బ కొట్టాలని చూస్తున్నట్టు భావిస్తున్నారు.

 రాజ్యసభ సీట్ల ద్వారా భారీగా డబ్బులు ... ప్రతిపక్షాల ఆరోపణలు

రాజ్యసభ సీట్ల ద్వారా భారీగా డబ్బులు ... ప్రతిపక్షాల ఆరోపణలు


వచ్చే ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 50 కోట్ల వరకూ పార్టీ ఫండ్ ఇస్తానని కెసిఆర్ పార్టీ నేతలకు భరోసా ఇచ్చారని, అందుకోసమే ఆర్థికంగా బలంగా ఉన్న వారికి రాజ్యసభ సీట్లను ఆఫర్ చేసి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు అన్న చర్చ కొనసాగుతుంది. దీంతో రాజ్యసభ సీట్లను ఇచ్చిన వారి ద్వారా సీఎం కేసీఆర్ బాగానే డబ్బులు దండుకున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. రాజ్యసభ సీట్ల విషయంలో సీఎం కేసీఆర్ సూట్కేసులు మోసగాళ్ళను పెద్దల సభకు పంపిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

పైసలకే పదవులు.. నోట్లకే కారు సీట్లు: రఘునందన్ రావు ట్వీట్


కేసీఆర్ సర్కార్ వారి పాటలో మంచి ధర పలికిన రాజ్యసభ సీట్లు అంటూ ఓ ఆసక్తికర పోస్టు ట్వీట్ చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పైసలకే పదవులు.. నోట్లకే కారు సీట్లు అంటూ కేసీఆర్ డబ్బులకు పదవులను అమ్ముకున్నారని టార్గెట్ చేశారు. సూట్కేసులు మోసేటోళ్ళు పెద్దల సభకా అంటూ రఘునందన్ రావు కెసిఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు ఇవ్వటానికి ఇంతకంటే మంచివాళ్ళు దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం డబ్బుల కోసమే వారికి సీట్లు ఇచ్చినట్టుందని రఘునందన్ రావు తన పోస్ట్ ద్వారా వ్యక్తం చేశారు.

English summary
Giving three Rajya Sabha seats in Telangana to businessmen has become a cause for criticism. BJP MLA Raghunandan Rao has targeted KCR, saying that the Rajya Sabha seats were highly priced in the KCR auction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X