వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం టోపీతో సీఐ రంజాన్‌ శుభాకాంక్షలు..!అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్‌..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పండుగలను ఎవరు ఎలా జరుపుకున్న పరవాలదు గాని పోలీసుల విషయానికి వచ్చే సరికి కొన్ని పరిమితులు ఉంటాయి. సంయమనం కోల్పోయి విద్యుక్త ధర్మాన్ని మర్చిపోతే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. సున్నితమైన కొన్ని అంశాల్లో శాంతి భద్రతలు కాపాడే పోలీసుల పైన మరింత పెద్ద బాద్యత ఉంటుంది. నలుగురి తో పాటు తాముకూడా వ్యవహరించి సోషల్ మీడియా ప్రాచూర్యం పొందాలని చూస్తే మాత్రం అది మరింత ఆక్షేపనీయం అవుతుంది.

తాజాగా బాద్యత గల ఓ పోలీసు ఆఫీసర్ పవిత్ర రంజాన్ రోజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో సంయమనం కోల్పోయినట్టు తెలుస్తోంది. ఉద్దేశం మంచిందే అయినప్పటికి చెప్పే విధానం సరిగా లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు సదరు పోలీసు అదికారి. నగరంలోని ఫలక్‌నూమ సీఐ కె. శ్రీనివాసరావు రంజాన్‌ పురస్కరించుకుని వివాదాస్పదమైన రీతిలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పోలీస్‌ యూనిఫాం ధరించి, అధికారిక హోదాలో ఉండి పోలీస్‌ టోపీ పక్కనబెట్టి ముస్లింల తరహా టోపీ పెట్టుకుని ఈద్‌ శుభాకాంక్షలు తెలపడం వివాదంగా మారింది.

MLA Raja Singh,who expressed objection with CI Greetings with Muslim hat..!!

పారదర్శకంగా ఉండాల్సిన పోలీసు అధికారి ఈ తరహాలో వ్యవహరించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తప్పుబట్టారు. సీఐ తీరుపై డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌లకు ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఖాకీ టోపీ తీసేసి ఓ మతానికి ప్రతీకగా ఉన్న టోపీ ధరించి సీఐ శుభాకాంక్షలు ఎలా చెప్తారని ఆయన సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు.

ఇది ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ రూల్స్‌ 1954 ప్రకారం డ్రెస్‌ కోడ్‌ని ఉల్లంఘించడమేనన్నారు. పోలీస్‌ యూనిఫాంలో ఉండి ఖాకీ టోపీని తీసివేసి ముస్లింలు ధరించే టోపీ పెట్టుకుని ఈదుల్‌ ఫిత్ర్‌ శుభాకాంక్షలు చెప్పడం పోలీస్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. గణేశ్‌ చతుర్థి, నవరాత్రి, దీపావళి పండుగల ఊరేగింపుల సందర్భంలో యువకులపై పోలీసులు లాఠీలు ఝుళిపించే సంఘటనలపైప్రభుత్వం, పోలీసులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

English summary
BJP MLA Rajasinghe blamed the police officer for being not transparent. DGP Mahender Reddy and Hyderabad CPI Anjani Kumar have been complaining to the CI. In the social media, he said, how can the CI greet the hat wearing a muslim hat instead of police of a hat?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X