• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్‌కు చిక్కులు: కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేలు.. పార్టీకి నష్టం చేసేదే?

|

హైదరాబాద్: కలెక్టర్లతో ఎమ్మెల్యేల పేచీలు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తలనొప్పులుగా మారాయి. కలెక్టర్ల పట్ల ఎమ్మెల్యేల తీరు పదేపదే వివాదాస్పదమవుతుండటం.. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదిగా మారింది. వీటిని ఇలాగే వదిలేస్తే.. ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయి తమ జులుం ప్రదర్శిస్తారన్న వాదనలు కూడా ఉన్నాయి.

పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్.. ఇలా పలు జిల్లాల్లో కలెక్టర్ల పట్ల స్థానిక ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. కలెక్టర్లకు కనీస గౌరవం ఇవ్వకపోవడం, వారి నిర్ణయాలకు అడ్డుపడటం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల జనంలోకి ప్రతికూల సంకేతాలను పంపిస్తోంది.

కరీంనగర్ కలెక్టర్‌తో రసమయి:

కరీంనగర్ కలెక్టర్‌తో రసమయి:

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డిజిధన్ మేళాలో.. ఫ్లెక్సీలో తన ఫోటో ఏర్పాటు చేయలేదన్న కారణంతో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఎమ్మెల్యే బాలకిషన్ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో కలెక్టర్ 'డోంట్ టాక్' అంటూ వేలు చూపిస్తూ ఎమ్మెల్యేను హెచ్చరించారు. కలెక్టర్ వ్యాఖ్యతో.. నాకే వేలు చూపిస్తావా అంటూ రసమయి నిప్పులు చెరిగారు.

కలెక్టర్ మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్య ప్రవర్తన.. కేసీఆర్ హెచ్చరిక!

పెద్దపల్లి కలెక్టర్ బదిలీ వివాదం:

పెద్దపల్లి కలెక్టర్ బదిలీ వివాదం:

జిల్లాలోని బొంపెల్లి గ్రామంలో దళితులపై ఎస్ఐలు దాడి చేసిన విషయాన్ని కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. అకారణంగా వారిని కొట్టడమే కాకుండా.. వ్యభిచారం చేస్తున్నారని నిందలు మోపినందుకు.. ఏకంగా సీఎస్ కు లేఖ రాసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధుల నుంచి ఆమెపై ఒత్తిళ్లు వచ్చాయన్న వాదనలున్నాయి.

గోలివాడ నిర్వాసితుల విషయంలోను కలెక్టర్ వారికి దన్నుగా నిలిచారు. భూనిర్వాసితుల సమస్యలకు సంబంధించి టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం కలెక్టర్ ను కలవడం ప్రభుత్వానికి మరింత మంట పుట్టించింది. దీంతో అలుగు వర్షిణి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో ఆమెపై బదిలీ వేటు వేశారు. అయితే అనారోగ్యం కారణం వల్లే ఆమే 6నెలల లీవు కోసం అప్లై చేసుకున్నారనేది మరో వాదన.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి చుక్కలు: తడాఖా చూపిన కలెక్టర్ దేవసేన..

జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి:

జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి:

జనగాం కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల మధ్య అప్పట్లో ప్రొటోకాల్ వివాదం చిచ్చు రేపింది. జిల్లాలో నిర్వహించిన సీడ్ బాల్స్ కార్యక్రమంపై తనకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్ దేవసేనను నిలదీశారు.

తాను ఐదారుసార్లు కాల్ చేశానని, కానీ మీరే లిఫ్ట్ చేయలేదని కలెక్టర్ బదులిచ్చింది. కాల్ చేసింది నిజమే అయితే ఫోన్ కాల్ లిస్ట్ చూపించాలని ముత్తిరెడ్డి నిలదీశారు. వర్షంలోనే జరిగిన ఈ వాగ్వాదం కలెక్టర్-ఎమ్మెల్యేల మధ్య విభేదాలను స్పష్టం చేసింది.

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్:

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్:

హరితహారం కార్యక్రమంలో మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కలెక్టర్ నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయడంతో.. కేసీఆర్ ఆయన్ను మందలించక తప్పలేదు. దీనిపై శంకర్ నాయక్ క్షమాపణలు కూడా చెప్పుకున్నారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు;

ప్రభుత్వానికి చెడ్డ పేరు;

కలెక్టర్ల పట్ల ఎమ్మెల్యేల తీరు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదిగా మారింది. పార్టీ నేతలను అదుపులో పెట్టట్లేదని కేసీఆర్‌ను విమర్శిస్తున్నవారు కూడా ఉన్నారు. కలెక్టర్లు సైతం తాము చెప్పినట్లే నడుచుకోవాలనే రీతిలో కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండటం క్షేత్రస్థాయిలో పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

English summary
TRS MLA's clash with district collectors creating new headache to Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X