వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన నర్సులకు ఎమ్మెల్యే సీతక్క సన్మానం

|
Google Oneindia TeluguNews

ములుగు ఎమ్మెల్యే సీతక్క కరోనా సెకండ్ వేవ్ పై జరుగుతున్న పోరాటంలో కూడా ముందు వరుసలో నిలిచారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో కరోనా వ్యాప్తికి కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు నిత్యావసరాలను అందించటంలో బిజీగా ఉన్న సీతక్క, ప్రస్తుతం ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా కరోనా వారియర్స్ గా పోరాటం సాగించిన నర్సులను, ఆశా వర్కర్ లను సత్కరించారు.

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ ను సన్మానించిన సీతక్క

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ ను సన్మానించిన సీతక్క


శాలువాతో సత్కరించి,వారందరికీ చీరలను అందించిన సీతక్క వారు చేస్తున్న సేవలను కొనియాడి,వారిలో స్ఫూర్తిని నింపారు. గత పదిహేను నెలలుగా మనమంతా ఒక రోజు నా కుటుంబంతో సంతోషంగా ఉన్నాం కానీ, హాస్పిటల్స్ లో పనిచేస్తున్న నర్సులు, ప్రతి గ్రామంలో పని చేస్తున్న ఆశ వర్కర్ల పరిస్థితి దారుణంగా ఉందని సీతక్క తెలిపారు. కరోనా మహమ్మారితో వారు సాగిస్తున్న పోరాటంలో వారు కుటుంబాలకు కూడా దూరంగా ఉంటూ మనందరినీ బతికించడం కోసం ఎంతో సేవ చేస్తున్నారని సీతక్క స్పష్టం చేశారు.

అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా నర్సులకు, ఆశా వర్కర్లకు ధన్యవాదాలు

అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా నర్సులకు, ఆశా వర్కర్లకు ధన్యవాదాలు


ఇవాళ అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా నర్సులకు, ఆశా వర్కర్లకు ధన్యవాదాలు తెలిపారు. వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ శాలువాతో సత్కరించి,వారికి చీరలు బహూకరించిన సీతక్క, కరోనా పోరాటంలో వారి సేవలను అంతే స్ఫూర్తితో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తన వాహనం నిండా చీరలు,శాలువాలతో ములుగు నియోజకవర్గంలో పర్యటించిన సీతక్క, ఎక్కడ కరోనా వారియర్స్ కనిపించినా వారిని గౌరవించి వారి బాధ్యతను మరింత పెంచారు. వారితో మాట్లాడి స్ఫూర్తి నింపారు.

కరోనా సెకండ్ వేవ్ లోనూ సీతక్క సాహసం .. గిరిజనులకు అండగా సీతక్క

కరోనా సెకండ్ వేవ్ లోనూ సీతక్క సాహసం .. గిరిజనులకు అండగా సీతక్క

ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ లో గిరి పుత్రుల కుటుంబాలను సందర్శిస్తున్న ఎమ్మెల్యే సీతక్క వారిలో కరోనాపై అవగాహన కల్పించటం మాత్రమే కాకుండా , ఎవరైనా కరోనా బారిన పడితే వారికి కావాల్సిన నిత్యావసరాలను అందిస్తూ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గ ప్రజలనే కాకుండా సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ఏపీ గిరిజన గూడేలకు సైతం కాలినడకన వెళ్లి , భుజాన వారికి కావాల్సిన నిత్యావసరాల బ్యాగులు మోసుకెళ్ళి సామాన్యుల్లో సామాన్యంగా నిలిచి తెలంగాణా రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్త గుర్తింపు పొందారు ఎమ్మెల్యే సీతక్క .

English summary
Mulugu MLA Seethakka was also at the forefront of the fight against the second wave. Seethakka, who is already busy providing essentials to people suffering from corona outbreaks in various parts of the country, today honored the nurses and Asha workers who fought as Corona Warriors on the occasion of International Nurses Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X