వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిలో ఘర్షణ: విష్ణు, వంశీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ఎన్ కన్వెన్షన్‌లో శుక్రవారం జరిగిన ఇద్దరు కాంగ్రెస్ యువనేతలు విష్ణువర్ధన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి మధ్య గొడవ సంచలనం సృష్టించింది. వీరి వివాదం విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు వెళ్లినట్లు తెలిసింది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభించనట్లు సమాచారం.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి బావమరిది శశాంక్ రెడ్డి వివాహం శుక్రవారం మాదాపూర్‌లోని ‘ఎన్-కనె్వన్షన్'లో జరిగింది. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. హాలులోకి వెళుతున్న సమయంలో వంశీచంద్ గన్‌మెన్ విష్ణువర్ధన్‌ను పక్కకు నెట్టివేయడంతో ఘర్షణకు దారితీసిందని కొంతమంది చెబుతున్నారు.

తన గన్‌మెన్‌ను ఎందుకు కొట్టారని వంశీ ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగి, ఘర్షణకు దారి తీసిందని అంటున్నారు. కానీ ఈ వాదనను వంశీ ఖండిస్తున్నారు. హాలులోకి వెళుతున్న సమయంలో విష్ణు తనకు షేక్‌హ్యాండ్ ఇచ్చారని, ఆ వెంటనే తనపై అకారణంగా దాడి చేయడం ప్రారంభించారని ఆయన తెలిపారు. తాను చెప్పింది వాస్తవమో కాదో సిసి టివీ ఫుటేజీ చూస్తే తెలుస్తుందన్నారు.

తన గన్‌మెన్ దాడి జరగకుండా అడ్డు వచ్చారే తప్ప విష్ణును నెట్టి వేయలేదన్నారు. పెళ్ళి కుమార్తె తరఫున తనకు ఆహ్వాన పత్రిక అందిందని ఆయన తెలిపారు. వంశీచంద్ రెడ్డి తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ‘నేను హైదరాబాద్‌వాసిని, దివంగత సిఎల్‌పి నేత పి జనార్దన్ రెడ్డి తనయుణ్ని. మాక్కూడా పౌరుషం ఉంది' అని విష్ణు అన్నారు. తనకు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు.

గొడవ పడాలంటే మైదానానికి వెళదామని ఆయన సవాల్ విసిరారు. వంశీచంద్‌ను తాము వివాహానికి ఆహ్వానించలేదని, ఆయనకు ఆహ్వాన పత్రిక ఎలా వెళ్ళిందో తెలియదని విష్ణు చెప్పారు. తనకు వంశీతో ఎటువంటి విభేదాలు లేవని, తాను యువజన కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అన్నారు.

వంశీచంద్ రెడ్డి

వంశీచంద్ రెడ్డి

తొలుత వంశీచంద్ రెడ్డి మాదాపూర్ పోలీసు స్టేషన్‌కు వెళ్ళి తనపై మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఆయన అనుచరులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు.

పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రికత్త

పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రికత్త

వంశీ తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విషయం తెలుసుకున్న విష్ణు కూడా హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు.

విష్ణువర్ధన్ రెడ్డి

విష్ణువర్ధన్ రెడ్డి

వంశీచంద్ రెడ్డి తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

విష్ణు తల్లి

విష్ణు తల్లి

విష్ణువర్ధన్ రెడ్డి తల్లి, సోదరి కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. వంశీ తనపై అకారణంగా దాడి చేశారని విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

ఇది ఇలాలాఉండగా వంశీ, విష్ణు అనుచరుల నినాదాలతో మాదాపూర్ పోలీసు స్టేషన్‌వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. తొలుత వంశీచంద్ రెడ్డి మాదాపూర్ పోలీసు స్టేషన్‌కు వెళ్ళి తనపై మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఆయన అనుచరులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. సిసి టివీ ఫుటేజీ చూస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుందని అన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడైన వంశీపై దాడి జరిగిందని తెలుసుకున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది పోలీసు స్టేషన్‌కు వచ్చి, వంశీపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని నినాదాలు చేశారు.

వంశీ తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విషయం తెలుసుకున్న విష్ణు కూడా హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన తల్లి, సోదరి కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. వంశీ తనపై అకారణంగా దాడి చేశారని విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వంశీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి తమకు న్యాయం జరగడం లేదని అన్నారు. కాగా, తన కుమారుడు విష్ణును హత్య చేసేందుకే వంశీ ఇక్కడికి వచ్చారని విష్ణు తల్లి ఆరోపించారు.

కాగా, పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో మాదాపూర్ జోన్ డిసిపి కార్తికేయ అక్కడికి చేరుకున్నారు. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించామని విచారణ జరిపి చర్య తీసుకుంటామని డిసిపి తెలిపారు.

English summary
High drama was witnessed on Friday at a high-profile wedding in Hyderabad. Ex MLA P. Vishnuvardhan Reddy and sitting Kalwakurthy MLA Challa Vamsi Chand Reddy embroiled in a brawl at wedding of the former's cousin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X