వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారంటేనే గుబులు, మూడో కన్ను తెరిస్తే'

|
Google Oneindia TeluguNews

నల్గొండ: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ సవాల్ విసిరారు. దానిపై టీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించారు. కోమటిరెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

అదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమానిఅదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమాని

కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు రాజీనామా చేయాలని, తాను కూడా రాజీనామా చేస్తానని, నకిరేకల్‌లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వీరేశం చెప్పారు. అలాగే వాళ్లు ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.

 వెనక్కి తగ్గేది లేదు

వెనక్కి తగ్గేది లేదు

డీసీసీబీ సీఈవోపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీఆర్ఎస్ శాసన సభ్యుడు వేముల వీరేశం చెప్పారు. సస్పెండైన డీజీఎం లక్ష్మికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.

 డబ్బులతో రాజకీయాలను కలుషితం చేశారు

డబ్బులతో రాజకీయాలను కలుషితం చేశారు

వచ్చే ఎన్నికల్లో రాజకీయ సన్యాసం ఎవరికో ప్రజలు తప్పకుండా నిర్ణయిస్తారని వీరేశం అన్నారు. కోమటిరెడ్డి సోదరులు డబ్బులతో రాజకీయాలను కలుషితం చేశారని మండిపడ్డారు. ఎంపీగా రాజగోపాల్ రెడ్డి గతంలో భువనగిరికి చేసింది ఏమిటో చెప్పాలని నిలదీశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారంటేనే వణుకు

కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారంటేనే వణుకు

ఈసారి నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతకుముందు ప్రకటించారు. నకిరేకల్‌కు కోమటిరెడ్డి సోదరులు వస్తున్నారంటేనే ఎమ్మెల్యే వీరేశంకు గుబులు పుడుతోందన్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ మూడో కన్ను తెరిస్తే

కోమటిరెడ్డి బ్రదర్స్ మూడో కన్ను తెరిస్తే

కేసీఆర్ కుటుంబం దిగి వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మూడో కన్ను తెరిస్తే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏ జిల్లాకు వెళ్లినా తమకు టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని ప్రజలు, కార్యకర్తలు చెబుతున్నారన్నారు.

English summary
TRS MLA Vemula Veeresham welcomed Congress MLC Komatireddy Rajagopal Reddy's challenges on politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X