వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగం‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరికకు దామోదర్ రెడ్డి మోకాలడ్డు, ఎఐసిసికి ఫిర్యాదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాగర్‌కర్నూల్: బిజెపి నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుకొనే ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ విషయమై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి తమ అభ్యర్థనను వినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ కూచకుళ్ళ దామోదర్‌రెడ్డి నేతృత్వంలో కొందరు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మకాం వేసి ఈ మేరకు లాబీయింగ్ చేస్తున్నారు.

బిజెపి నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. బిజెపి నాయకత్వం అనుసరిస్తున్న విధానాలతో నాగం జనార్థన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉగాది తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.

అయితే నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. దీంతో నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా ఆ పార్టీకి చెందిన నేతలు ప్రయత్నాలను ప్రారంభించారు. నాగం జనార్ధన్ రెడ్డి టిడిపిలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఏ రకంగా ఇబ్బందులకు గురిచేసిన విషయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ అధిష్టానానికి విన్నవించే ప్రయత్నాలు చేస్తున్నారు.

నాగం జనార్ధన్‌రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని నేతల వినతి

నాగం జనార్ధన్‌రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని నేతల వినతి

మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ఉగాది తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా ఆ పార్టీ నేతలు ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించారు. నాగం జనార్ధన్‌రెడ్డి ప్రత్యర్థి ఎమ్యెల్సీ కూచకుళ్ళ దామోదర్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్యతో కలిసి దామోదర్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ, ఎఐసిసి ఎస్సీ సెల్ ఛైర్మెన్ కొప్పుల రాజును కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు

ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏకపక్ష నిర్ణయాల కారణంగా స్థానికంగా తమకు ఇబ్బందులు తప్పడం లేదని నాగర్ కర్నూల్ కు చెందిన కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డి గతంలో పలుమార్లు దామోదర్ రెడ్డిపై టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. 2012లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవని దామోదర్ రెడ్డి భావిస్తున్నారు. ఈ తరుణంలో నాగం జనార్ధన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నాలను ప్రారంభించారు. ఏకపక్షనిర్ణయాల కారణంగా తాము నష్టపోతున్నట్టు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ పై ఆనాడు నాగం వేధింపులు

కాంగ్రెస్ పై ఆనాడు నాగం వేధింపులు

నాగం జనార్ధన్ రెడ్డి టిడిపిలో ఉన్న కాలంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను ఇబ్బందులు పెట్టిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. నాగం జనార్ధన్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఇబ్బందులు పడిన విషయాన్ని పూసగుచ్చినట్టు కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కానీ, తమను సంప్రదించకుండానే చేరికలతో రాజకీయంగా తాము నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు.

 ఢిల్లీ నేత ఒత్తిడే కారణమా

ఢిల్లీ నేత ఒత్తిడే కారణమా


నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొనేందుకు ఢిల్లీ స్థాయి నేత ఒకరు చక్రం తిప్పుతున్నారని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో మకాం వేసిన నేతలకు కూడ ఈ విషయమై కొంత స్పష్టత వచ్చిందంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకే తాము నడుచుకొంటామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు.

English summary
Nagarkurnool Mp Nandi Yellaiah and MLC Damodar Reddy opposed for Nagam Janardhan Reddy join in congress party. They were already complained against Congress party incharge Kuntia, AICC SC cell incharge koppula Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X