వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ ఎన్నికల మాక్ పోలింగ్, లోక్ సభ ఎన్నికలపై దిశానిర్దేశం .. టీఆర్ఎల్పీ భేటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తర్వాత రాజకీయ పార్టీలు తమ కార్యాచరణపై ఫోకస్ చేశాయి. బలబాలాలు, అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాల ఆధారంగా క్యాండెట్ల ఎంపిక జరుగుతోంది. ఇవాళ టీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశమవుతోంది. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై సభ్యులకు అవగాహన కార్యక్రమం ఉంటుంది. తర్వాత లోక్ సభ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.

mlc election mock polling conducted by trs mlas

పకడ్బందీగా నిర్వహణ
సీఎం కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 12న జరగనుంది. రాష్ట్రంలో 5 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఐదు సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ .. వారి విజయం కోసం వ్యుహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒక్కో ఎమ్మెల్సీ గెలువాలంటే 21 మంది సభ్యుల ఓటు కావాలి. ఐదుగురు గెలువాలంటే 105 మంది ఓట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ 91, ఎంఐఎం ఏడుగురు సభ్యులతో 98 మంది ఉన్నారు. సండ్ర వెంకట వీరయ్య, రేగా కాంతారావు, ఆత్రం సక్కు చేరితో ఆ సంఖ్య 101కి చేరింది. హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి చేరికతో 103కి చేరుకోనుంది. అంటే తమ పార్టీ విజయానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఓటు అవసరమవుతోంది. మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా విజయం సాధించాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నందున .. మరో ఇద్దరు ఎవరనేదీ సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో తమ సభ్యులు తప్పు చేయకుండా .. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకోసమే నిపుణులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేసింది. తర్వాత మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తోంది.

పుల్వామా దాడిలో నిజాలు రాయొద్దా ? ప్రకటనలు నిలిపివేయడంతో ఖాళీ ఫ్రంట్ పేజీతో పత్రికల నిరసన

పార్లమెంట్ స్థానాలపై దిశానిర్దేశం
ఎమ్మెల్సీ మాక్ పోలింగ్ ముగిసాక .. సభ్యులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం ఉంటుంది. ప్రధానంగా పార్లమెంట్ స్థానాల్లో విజయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ 16, ఎంఐఎం 1 సీటు కలిపి .. మొత్తం 17 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ? ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి ? తొలి దఫా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించాలని .. తదితర అంశాలపై ఎమ్మెల్యేలకు నిర్దేశం చేస్తారు కేసీఆర్. అలాగే గ్రూపు రాజకీయాలు లేకుండా అందరూ కలిసి సమన్వయంతో కలిసి పనిచేయాలని స్పష్టంచేసే అవకాశాలు ఉన్నాయి.

English summary
trs mlas to meet today telangana bhavan for mlc quota election and loaksabha polls. mlc election Awareness program and mock polling conducted. after that cm kcr awareness on loaksabha polls 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X