వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌, కేటీఆర్‌కు అహంకారం తగ్గాలి.. కవిత, వినోద్ ఓడిపోయింది అందుకే : జీవన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

జగిత్యాల : లోక్‌సభ ఫలితాల్లో టీఆర్ఎస్ మెజార్టీ తగ్గడం విపక్ష నేతలకు అస్త్రం దొరికినట్లైంది. 16 స్థానాల్లో గెలుస్తామంటూ గొప్పగా చెప్పిన టీఆర్ఎస్ నేతలు చివరకు 9 స్థానాలకే పరిమితమయ్యారు. సారు..కారు..పదహారు అంటూ ప్రచారం హోరెత్తించినప్పటికీ.. ఫలితాలు వచ్చే నాటికి సీన్ రివర్సయింది. దాంతో టీఆర్ఎస్‌పై విపక్ష నేతలు మాటల దాడికి దిగుతున్నారు.

కేసీఆర్‌కు సగం తగ్గింది.. అది పూర్తిగా తగ్గాలి.. వెంకన్నకు వీహెచ్ మొక్కులు..!<br>కేసీఆర్‌కు సగం తగ్గింది.. అది పూర్తిగా తగ్గాలి.. వెంకన్నకు వీహెచ్ మొక్కులు..!

mlc jeevan reddy fired on cm kcr and ktr

మెదక్ లోక్‌సభ స్థానంలో సన్నాహాక సమావేశాలు నిర్వహించినప్పుడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన బావ హరీష్ రావుతో పెద్ద ఛాలెంజ్ చేశారని ఎద్దేవా చేశారు. బావ మీకంటే కరీంనగర్ పార్లమెంటరీ స్థానంలో ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటామని కేటీఆర్ గొప్పలకు పోయారని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే బావ సెగ్మెంట్‌లో లక్షలకొద్దీ మెజార్టీ వస్తే.. కరీంనగర్‌లో వినోద్ కుమార్ ఓడిపోవడంతో కేటీఆర్ బొక్కబొర్లా పడ్డారని చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన తనయుడు కేటీఆర్‌కు అహంకారం పనికిరాదని హితవు పలికారు జీవన్ రెడ్డి. బోయినపల్లి వినోద్ కుమార్ ఓటమికి నూరు శాతం కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో టీఆర్ఎస్ 50వేల ఓట్లు కోల్పోయిందని వివరించారు.

English summary
Congress Senior Leader adn MLC T.Jeevan Reddy fired on CM KCR and His Son TRS Working President KTR. He also made allegations that TRS MLAs are main reason to defeat Kavitha from nizamabad and vinod kumar from karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X