జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం... జగిత్యాల జిల్లా పర్యటనలో అపశృతి... నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం(ఫిబ్రవరి 25) జగిత్యాల జిల్లా పర్యటనలో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు-రాయికల్ మార్గంలో మల్యాల మండలం,రాజారం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

కవిత కాన్వాయ్ రాజారం మీదుగా వెళ్తున్న సమయంలో.. ఆమె ప్రయాణిస్తున్న కారు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కారు కొద్దిగా టచ్ అయినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన కవిత కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో.. వెనకాల వచ్చిన మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కవిత కారును కూడా ఢీకొట్టడంతో మొత్తం ఐదు కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో అంతా సురక్షితంగా బయటపడ్డారు.

mlc kalvakuntla kavitha convoy road accident in jagtial tour

అంతకుముందు, రాయికల్‌ మండలం కొత్తపేట గ్రామంలోని నాగాలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం చేశారు.
దొంగల మర్రి చౌరస్తాలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

కాగా,గతేడాది ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి కవిత నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. జిల్లాలో అభివృద్ది పనుల విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. ప్రజల నుంచి వినతులను అప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులను పురమాయిస్తున్నారు. ఇటీవల సావిత్రిభాయి పూలే భవన్ పేరుతో జిల్లాలో బీసీ భవన్,ఉద్యోగార్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్‌ నిర్మాణానికి పూనుకున్నారు. అలాగే ఎస్సీ ఉపకులాల ప్రజా ప్రతినిధులతోనూ సమావేశమై ఆ సామాజికవర్గాల సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కవిత... వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గంలో మళ్లీ పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. జనం విశ్వాసాన్ని చూరగొనేందుకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

English summary
Nizamabad TRS MLC Kalvakuntla's Kavita narrowly escaped from accident. Her convoy met with an accident on Thursday (February 25) during a visit to Jagtial district. Five cars in the convoy collided with each other. The cars were slightly wrecked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X