నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత... కారు దిగి ఆ మహిళకు సపర్యలు,ఆస్పత్రికి తరలింపు..

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోయిన ఓ మహిళను గుర్తించిన కవిత... వెంటనే కారు దిగి ఆమె వద్దకు పరిగెత్తారు. రోడ్డు ప్రమాదానికి గురైందని తెలుసుకుని.. వెంటనే ఆమెను వాహనంలో ఆస్పత్రికి తరలించేలా చేశారు. మంగళవారం(డిసెంబర్ 22) కవిత నిజామాబాద్ పర్యటనకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ

Recommended Video

మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత కవిత మంగళవారం తొలిసారిగా నిజామాబాద్ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో కంఠేశ్వర్ వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఒక పెద్దావిడ స్పృహ తప్పి పడిపోయి ఉండటం గమనించారు.వెంటనే కారు ఆపిన కవిత.. ఆ పెద్దావిడ వద్దకు పరిగెత్తి ఆమె పరిస్థితిని గమనించారు. కొద్దిసేపు ఆమెకు సపర్యలు చేశారు. అనంతరం ఓ వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించేలా చేశారు. వైద్యులతో మాట్లాడి ఆ మహిళకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కవిత ఔదార్యం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

 mlc kavita Halts Official Visit To Help Unconscious Woman Lying On Road

అనంతరం కవిత ఇందల్వాయి మండలం దేవితండాలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని, బోర్గావ్‌లో ఉన్న లక్ష్మి గణపతి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి,మోపాల్‌ మండలం భైరాపూర్, డిచ్‌పల్లి మండలంలో పర్యటించారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ కవిత వలస కార్మికుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. గల్ఫ్‌‌తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వారిని వెనక్కి రప్పించేందుకు ఆమె కృషి చేశారు.

English summary
Telangana MLC from Nizamabad, Kalvakuntla Kavitha on Tuesday shortly halted her official visit to her constituency to help a woman who was lying unconscious on the road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X