వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యం.!నిజామాబాద్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.!

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్/హైదరాబాద్ : తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్ పార్టీ అని, బంగారు తెలంగాణ ఒక్క గులాబీ పార్టీతోనే సాద్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్ఘాటించారు.నిజామాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత, టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రజలను ఉద్దేశించి కవిత మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా తెలియజేస్తూ, నిరంతం ప్రజల కోసమే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

నిజామాబాద్ లో ఎమ్మెల్సీ బిజీబిజీ.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత..

నిజామాబాద్ లో ఎమ్మెల్సీ బిజీబిజీ.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత..

ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మితమవుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, ప్రతి గ్రామంలోని కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. కార్యాలయాల్లో ఉండే సిబ్బంది, ఇన్సూరెన్స్ లాంటి అనేక అంశాల్లో కార్యకర్తలకు సహాయసహకారాలు అందిస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీల్లో ఒకటిగా టీఆర్ఎస్ నిలిచిందన్నారు ఎమ్మెల్సీ కవిత.

నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం.. నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం.. నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత

ఉదయం క్యాంపు కార్యాలయంలో అనేకమంది కార్యకర్తలు, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించిన ఎమ్మెల్సీ కవిత అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్, బోర్గాం పి.గ్రామంలో ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు ఉమారాణి, సాయరాం, జర్నలిస్టు బాలులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.

ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నదానం అభినందనీయం.. ఎంతోమంది ఆకలి తీర్చిందన్న ఎమ్మెల్సీ

ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నదానం అభినందనీయం.. ఎంతోమంది ఆకలి తీర్చిందన్న ఎమ్మెల్సీ

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన వితరణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేపట్టిన ఉచిత అన్నదానం ఎంతోమందికి ఉపయోగపడిందన్న ఎమ్మెల్సీ కవిత, మరికొద్ది రోజులు కరోనా పట్ల అప్రమత్తత అవసరమన్నారు. అనంతరం ఫులాంగ్ చౌరస్తా లోని పులాంగ్ పార్క్ ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, కార్పోరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బాలిక వైద్యానికి సాయం.. అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

బాలిక వైద్యానికి సాయం.. అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల పాప మోక్ష మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. నిజామాబాద్ లో ఈరోజు ‌మోక్ష తండ్రి, ఎమ్మెల్సీ ‌కవితను కలిసి, బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా, మోక్ష వైద్యానికి అండగా ఉంటానని ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు.

English summary
MLC Kalvakuntla Kavitha, who was involved in various activities in Nizamabad, examined the construction work of the new office of the TRS party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X