• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా కష్టకాలంలో మానవత్వం చాటుతున్న ఎమ్మెల్సీ కవిత.. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి..!

|

హైదరాబాదు: తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ సహాయం కోరుతూ చాలామంది నిజామాబాద్ ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఆశ్రయిస్తున్నారు. ఈ కష్టకాలంలో కవిత అందరికీ అందుబాటులో ఉంటూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. తన తండ్రి సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఓ వైపు బాధపడుతున్నప్పటికీ... సహాయం కోరి వచ్చిన సాధారణ ప్రజలను మాత్రం విస్మరించడం లేదు.

ఒకసారి కవిత ట్విటర్ టైమ్‌లైన్‌ను చూస్తే తాను ప్రజలకు ఏమేరకు అందుబాటులో ఉందో అర్థమవుతుంది. అంతేకాదు ప్రజలకు ఎలాంటి సహాయసహకారాలు అందించిందో కూడా స్పష్టంగా తెలుస్తుంది. కరోనా వచ్చిన వారికి హాస్పిటల్‌లో కావాల్సిన పడక నుంచి రెమ్‌డెసివిర్ డ్రగ్ వరకు అన్ని సకాలంలో అందేలా ఏర్పాటు చేశారు కవిత. ఇందుకోసం 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్‌లైన్ నెంబరుకు రోజుకు 300 కాల్స్ వస్తాయని కవిత టీమ్ చెబుతోంది. వీరంతా కోవిడ్‌తో ఏర్పడ్డ సమస్యల పరిష్కారం కోసం ఫోన్లు చేస్తుంటారని చెబుతున్నారు.

MLC Kavitha sets up helpline for COVID-19 affected in Telangana

ఇక ఈ ఫోన్లు చేసేవారి సమస్యల పరిష్కారం కోసం తెరవెనక ఒక పెద్ద బృందమే పనిచేస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాదులోని పేషెంట్‌కు రెమిడెసివిర్ ఇంజెక్షన్ అవసరం కాగా ఆ ఇంజెక్షన్‌ను నిజామాబాద్ నుంచి పంపడం జరిగింది. అంతేకాదు కరోనాతో నిజామాబాదులోని హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ పడకలు ఫుల్ కావడంతో... ఆ పేషెంట్‌ను హైదరాబాదులోని టిమ్స్‌కు తరలించడం జరిగింది.

ఇక కవిత తన నియోజకవర్గంపై దృష్టి సారిస్తూనే...సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఎలాంటి సహాయం అడిగినా కాదనకుండా కవిత చేస్తున్నారు. కోరుట్ల గ్రామంలో 10వేల కోవిడ్ టెస్టు కిట్లు పంపాల్సిందిగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు కవిత.ఇక జిల్లా కలెక్టర్లతో కోవిడ్ పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు కవితి. హాస్పిటల్ అధికారులతో, టెస్టింగ్ సెంటర్ల అధికారులతో, ఆరోగ్యశాఖ అధికారులతో కూడా టచ్‌లో ఉంటున్నారు. ఇక ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కవిత సమీక్షా సమావేశంను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఎన్ని కాల్స్ వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ప్రజల అవసరతలు కనుక్కుని మరుసటి రోజు ఆ అవసరం తీరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా తప్పుడు వార్తలే షికారు చేస్తున్నాయి. కానీ కవిత సోషల్ మీడియా మాత్రం ఈ కష్ట సమయంలో చాలా మందికి వరంలా మారింది. ఇలానే ఉత్తరాదిన ఉన్న రాజకీయనేతలు కూడా ఎమ్మెల్సీ కవితను స్ఫూర్తిగా తీసుకుంటే కోవిడ్ సమస్యలు చాలా వరకు పరిష్కరించవచ్చనే అభిప్రాయంను చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

  NTR Is The Vaccine For CBN, Lokesh Viruses ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వేయించుకోండి || Oneindia Telugu

  English summary
  TRS’ K Kavitha sets up helpline for COVID-19 affected in Telangana.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X