వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇవ్వండి.. యునెస్కో ప్రతినిధులకు ఎమ్మెల్సీ వినతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లోని యునెస్కో ప్రతినిధులను కలిశారు. ఆ మేరకు రామప్ప ఆలయ విశిష్టతను, చరిత్రను, శిల్ప కళావైభవాన్ని తెలియజేసే విధంగా అందమైన దృశ్యమాలికను యునెస్కో ప్రతినిధి పోష్యనందన్‌కు అందించారు.

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కేలా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఆ మేరకు గత నెలలో ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువు దీరిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆ క్రమంలో యునెస్కో బృందం గుర్తింపు దక్కడానికి ఆలయ పరిసరాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

MLC Pochampalli Srinivas Reddy trying World Heritage Identity to ramappa temple

ఇంజనీరింగ్ కాలేజీలో కుక్కల బీభత్సం.. విద్యార్థినిపై దాడి, పరిస్థితి విషమం..!ఇంజనీరింగ్ కాలేజీలో కుక్కల బీభత్సం.. విద్యార్థినిపై దాడి, పరిస్థితి విషమం..!

అంతేగాకుండా ప్రపంచ గుర్తింపు దక్కడానికి అవసరమైన అన్నీ చర్యలు తీసుకున్నారు పోచంపల్లి. ఆ మేరకు రామప్ప శిల్ప కళా వైభవాన్ని కళ్లకు కట్టేలా డాక్యుమెంటరీ రూపంలో దృశ్య మాలికను సిద్ధం చేశారు. అదే క్రమంలో శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని యునెస్కో కార్యాలయానికి వెళ్లి దాన్ని పోష్యనందన్‌కు అందించారు.

MLC Pochampalli Srinivas Reddy trying World Heritage Identity to ramappa temple

కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప ఆలయం. రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తుంటారు. ములుగు జిల్లా పరిధిలోకి వచ్చే రామప్ప ఆలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఆలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఇప్పటికీ ఇది వేల ఎకరాల పంటకు ఆధారంగా నిలుస్తోంది. ఆనాటి శిల్ప కళా వైభవం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

English summary
MLC Pochampalli Srinivas Reddy met with UNESCO Representative at Hyderbad and submitted Warangal Ramappa Temple Photo Album to give World Heritage Identity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X