వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కె దామోదర్‌రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఇ. కృష్ణారెడ్డి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే అబ్రహంలతో పాటు మరికొందరు పార్టీ నేతలు శనివారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతల చేరిక

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతల చేరిక


శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వారు పలువురు రాష్ట్ర మంత్రుల సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి వచ్చిన నేతలకు మంత్రి హరీశ్‌రావు పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు.టీఆర్ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, టీడీపీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు.

అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తాం

అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తాం

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్ అన్నిస్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాకుంటే కేసులు వెనక్కు తీసుకోవాలని, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ పార్టీని పాలమూరు జిల్లాలో ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రైతులు ఆనందంగా ఉంటే కాంగ్రెస్ నాయకుల కళ్లు మండుతున్నాయని హరీశ్ విమర్శించారు. పాలమూరు జిల్లా జాతీయ నాయకులను అందించినా అక్కడి ప్రజలకు మాత్రం వలసలే మిగిలాయని ఆవేదన వ్యక్తంచేశారు.

కేసీఆర్‌ను కలిసిన నాయకులు

కేసీఆర్‌ను కలిసిన నాయకులు

టీఆర్‌ఎస్‌లో చేరిన దామోదర్‌రెడ్డి, అబ్రహాం, ఎడ్మ కృష్ణారెడ్డిలు.. అనంతరం మంత్రులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని, బంగారు తెలంగాణగా మార్చుకుందామని సూచించారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.

భారీగా చేరికలు

భారీగా చేరికలు

టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో బిజినేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు సుధాపరిమళ బాలరాజు, నాగర్‌కర్నూలు ఎం పీపీ బండి సత్తమ్మ, నాగర్‌కర్నూలు మున్సిపల్ కౌన్సిలర్లు రేణు బాబు, వజ్ర లింగం, కావలి శ్రీనివాసులు, ఇస్మాయిల్‌బేగం, ఎంపీటీసీ సభ్యులు ఎం ప్రకాశ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బాల్ రాములు, బిజినేపల్లి సర్పంచ్ తిరుపతయ్య, లింగసానిపల్లి సర్పంచ్ ఎస్ నరేందర్‌రెడ్డి, బండ్లపల్లి సర్పంచ్ రాములు, నడిగడ్డ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, పెద్దాపూర్ సర్పంచ్ పర్వతాలు, రాయిపాకుల సర్పంచ్ సుదర్శన్‌రావు, నాగర్‌కర్నూల్ ఎంపీటీసీ చంద్రకళ, లట్టుపల్లి ఎంపీటీసీ చంద్రగౌడ్, మమ్మాయిపల్లి ఎంపీటీసీ బానయ్య, మరికల్ ఎంపీటీసీ వెంకట్‌రాంరెడ్డి ఉన్నారు. కల్వకుర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్‌తోపాటు ఐదుగురు కౌన్సిలర్లు కుటుముల పావని, కుర్షిదా బేగం, తలసాని సౌజన్య, జానకమ్మ, పద్మతోపాటు పీఏసీఎస్ వైస్‌చైర్మన్‌లు జనార్దన్‌రెడ్డి, రామస్వామి తదితరులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

బుజ్జగింపులు విఫలం

బుజ్జగింపులు విఫలం

దామోదర్‌రెడ్డి పార్టీ మారుతున్నారన్న సమాచారంతో కాంగ్రెస్‌ నాయకులు రంగంలోకి ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటీవల మాజీ మంత్రి డీకే అరుణ కూడా దామోదర్‌రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

English summary
Sitting Congress MLC K. Damodar Reddy from Nagarkurnool and two other former MLAs from the opposition party, Yadma Kista Reddy (Kalwakurthy) and V.M. Abraham (Alampur), along with their followers were among several others from TDP and BJP who joined the ruling Telangana Rashtra Samiti (TRS) here on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X