హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది తెలిసి టెక్కీ సునీత ఆత్మహత్య: ఓ అమ్మాయితో నిందితుడి కాపురం

ప్రేమ పేరుతో మోసం చేసి టెక్కీ సునీత ఆత్మహత్యకు కారకుడైన కేసులో నిందితుడు శ్రవన్‌ను శనివారం నాడు మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేమ పేరుతో మోసం చేసి టెక్కీ సునీత ఆత్మహత్యకు కారకుడైన కేసులో నిందితుడు శ్రవన్‌ను శనివారం నాడు మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రవణ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు. పని చేస్తున్న కంపెనీ మూసివేయడంతో పంజాగుట్టలోని జస్ట్ డయల్‌లో కొద్ది రోజులు పని చేశాడు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని మరో కంపెనీలో ప్రాసెసర్ డెవలపర్‌గా పని చేశాడు.

<strong>టెక్కీ సునీతని మోసగించిన వాడు మామూలోడు కాదు: ఏడాదిలో 6గురితో..</strong>టెక్కీ సునీతని మోసగించిన వాడు మామూలోడు కాదు: ఏడాదిలో 6గురితో..

జస్ట్ డయల్‌లో పని చేస్తున్న సమయంలో టెలీ కాలర్‌గా పని చేస్తున్న సునీతతో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె వద్ద రూ.1 లక్ష తీసుకొని, ఇంకా డబ్బులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

సునీతతో పాటు మరికొందరు అమ్మాయిలతో స్నేహం చేసినట్లు శ్రవణ్ అంగీకరించాడు. సునీతను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆమెను బెదిరిస్తూ సందేశాలు పంపించాడు.

<strong>టెక్కీ సునీత ఆత్మహత్యలో మరో కోణం: కట్నం కావాలన్న ప్రియుడు..</strong>టెక్కీ సునీత ఆత్మహత్యలో మరో కోణం: కట్నం కావాలన్న ప్రియుడు..

ఈ నెల 14వ తేదీన పెళ్ళి విషయం తేల్చాలని సునీత మెసేజ్‌లు పెట్టారు. వాటిని శ్రవణ్ పట్టించుకోలేదు. నువ్వు రాకపోతే చనిపోతానని మెసేజ్ పంపించింది. అయినా అతను స్పందించలేదు. దీంతో ఈ నెల 15న భాగ్యనగర్ కో ఆపరేటివ్ సొసైటీ ఖాళీ స్థలంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రవణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి బైక్, సెల్ ఫైన్ స్వాధీనం చేసుకున్నారు.

ఆరుగురిని ట్రాప్ చేశాడు... ముగ్గురి నుంచి డబ్బులు

ఆరుగురిని ట్రాప్ చేశాడు... ముగ్గురి నుంచి డబ్బులు

సునీత మృతి కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. సునీత మృతికి కారకుడైన శ్రవణ్‌ మొత్తం ఆరుగురు యువతులను ప్రేమించి మోసం చేసినట్లు విచార ణలో వెల్లడయింది. అందులో ముగ్గురిని పెళ్లి చేసుకుంటానని చెప్పి భారీగా డబ్బు తీసుకున్నాడు.

శ్రవణ్

శ్రవణ్

ఈ నెల 15న మాదాపూర్‌లోని భాగ్యనగర్‌ కో ఆపరేటివ్‌ సొసై టీలో టెలికాలర్‌ సునీత మృతి చెందిన తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు పాము శ్రవణ్‌‌ను మాదాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం మాదాపూర్‌ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రమణకుమార్‌, డీఐ శశాంక్ రెడ్డి వివరాలు తెలిపారు.

ఓ యువతితో కాపురం కూడా పెట్టాడు

ఓ యువతితో కాపురం కూడా పెట్టాడు

నిందితుడు శ్రవణ్ 2010 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అమ్మాయిలను ప్రేమించాడు. వారి నుంచి డబ్బు తీసుకుని పెళ్లిపేరు ఎత్తగానే ప్లేట్‌ ఫిరాయించేవాడు. ఒక అమ్మాయితో కూకట్‌పల్లిలో వేరు కాపురం పెట్టాడు. సునీతను బైక్ మీద తీసుకెళ్తున్న దృశ్యాలను పోలీసులు సీసీటీవీలో గుర్తించారు.

ఆ విషయం తెలిసి సునీత ఆత్మహత్య

ఆ విషయం తెలిసి సునీత ఆత్మహత్య

మొదట ప్రేమించిన అమ్మాయిని పెళ్లి ఖర్చులకు మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో ఆ యువతిని వదిలేశాడు. చివరకు ఓ మాట్రిమొనీ వైబ్‌సైట్లో పరిచయమైన యువతిని పెళ్లిచేసు కోవడానికి సిద్ధమయ్యాడు. ఆ అమ్మాయి దగ్గర కావడంతోనే సునీత కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. అందరితోనూ శారీరక సంబంధం నెరిపాడని చెప్పారు. కాగా.. సునీత, శ్రవణ్‌ మధ్య జరిగిన వాట్సప్‌, మేసేజ్‌లు 600 పేజీలు సేకరించారు పోలీసులు.

గతంలోనూ బెదిరింపులు

గతంలోనూ బెదిరింపులు

సునీత గతంలో కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని నిందితుడు శ్రవణ్ తెలిపాడు. కిరోసిన్‌ ప్యాకెట్‌ బ్యాగ్‌లో పెట్టుకుని సికింద్రాబాద్‌లో ఉందని, ఆ సమయంలో అక్కడికెళ్లి ఆ ప్యాకెట్‌ను టివోలి థియేటర్‌ మురుగు కాలువలో పడేశానని తెలిపాడు. వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పినా తరచూ పెళ్లిచేసుకోవాలని సునీత వేధించేదని చెప్పాడు. తనను అనుమానించేదని, అందుకే పెళ్లికి నిరాకరించానని చెప్పాడు.

English summary
A process developer from a MNC was arrested by Madhapur police on charges of abetment of suicide, extortion and cheating of 32 year-old telecaller K Sunitha, who set herself ablaze, allegdly after being rejected by accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X