వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతనో సంచలనం: 78 కేసుల్లో నిందితుడు, 30 హత్యలే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనాలకు మారుపేరుగా నిలిచిన మావోయిస్టు నేత పుట్టపాక కుమారస్వామి అలియాస్ సుశీల్ అలియాస్ వసంత అలియాస్ రంజిత (45) ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భార్య సోనీతో సహా ఆయన ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని బాంజీపేటకు చెందిన కుమారస్వామి 23 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు.

దళ సభ్యుడి స్థానం నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడు. ఆయనపై 78 కేసులు నమోదు కాగా, అందులో 30 హత్య కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతను ఏడు భాషల్లో ధారాళంగా మాట్లాడగలడని చెబుతారు.

ఒడిశా రాష్ట్రంలోని అంగల్‌- డియోగర్‌ సరిహద్దు ప్రాంతంలో ఆయన భార్య సిందెరి లింగో అలియాస్‌ సోనితో సహా పోలీసులతో జరిగి న ఎదురుకాల్పుల్లో మృతి చెందారని ఒడిశా రాష్ట్ర డీజీపీ కేబీసింగ్‌ తెలిపారు. కుమారస్వామి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడి స్థాయిలో ఉండగా, ఆయనభార్య జిల్లా కమిటీ సభ్యురాలు హోదాలో ఉంది.

 warangal,

ఆయన మీద ప్రభుత్వం రూ.25లక్షల రివార్డు, ఆయన భార్య సోని తలపై రూ.5లక్షల రివార్డు ప్రకటించింది. కుమారస్వామి దైతారి పోలీస్‌ స్టేషన్‌, కలిహత పోలీస్‌ ఔట్‌ పోస్టు పేల్చివేత, పెద్ద ఎత్తున చింద్‌గుడిపాల్‌లోని ఐఎమ్‌ఎఫ్ఏ మైన్స్ నుం చి పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్ళిన సంఘటనతో పాటు సంచలనం సృష్టించిన ఏఎస్ఐ ఉమేష్‌ మరాండి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

వరంగల్‌ సీకేఎం కాలేజీలో డిగ్రీ చదువుతున్నపుడే అప్పటి పీపుల్స్‌వార్‌ రాజకీయాల పట్ల ఆకర్షితుడయినట్లు తెలుస్తోంది. ఎల్‌ఎల్‌బీ చదువుతూ మధ్యలోనే ఆపి వేసి పూర్తి కాలం పీపుల్స్‌వార్‌ రాజకీయాల్లోకి వెళ్ళాడు. మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ రక్షణ కో సం ఉపయోగించే ప్లటూన-6లో సెక్షన కమాండర్‌గా అతను పనిచేసినట్లు సమాచారం. ఆ తర్వాత పదోన్నతిపై మావోయిస్టు పార్టీ కు మారస్వామిని ఒడిశాకు పంపించినట్లు తెలుస్తోంది.

పాండా మావోయిస్టు పార్టీని వీడిన కొంత కాలానికి కుమారస్వామి తన భార్య విశాఖపట్నం జిల్లా కొయ్యూర్‌ కిన్నెంగి గ్రామానికి చెందిన సిందెరీ లింగో అలియాస్‌ సోనితో కలిసి మావోయిస్టు పార్టిని వీడినట్లు సమాచారం.. ప్రత్యేకంగా ఒక సాయుధ గ్రూపును నడుపుతున్నట్లు సమాచారం.

English summary
The Maoist leader Kumara Swami alias Sushhel has been killed in an encounter in Odisha, is from Warangal district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X