వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ మోస‌గాడు,దుర్మార్గుడు అంటున్న హీరోయిన్..! రాఫెల్ ఒప్పందంలో త‌ప్పులు జ‌రిగాయంటున్న వ‌ర్ల‌..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఇటీవలే బీజేపీలో చేరి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న సినీనటి మాధవీలత అనూహ్యంగా ప్రధాని మోదీపైనా, భార‌తీయ జ‌న‌తా పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇపుడు సోషల్‌ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. సోషల్‌ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో ఆమె గడిచిన రెండు రోజులుగా బీజేపీ, ఆపార్టీ సానుభూతి పరులపై నిప్పులు చెరుగుతున్నారు.

అసలు తాను బీజేపీలో చేరిందే బీజేపీ నిజంగా దేశానికి సహాయం చేస్తుందా? నాశనం చేస్తుందా? అనేది చూడడానికి అని చెప్పారు. నిజంగా మోదీ దుర్మార్గుడని వ్యాఖ్యానించారు. ఇపుడు ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. బీజేపీలోనే ఉంటూ ఆ పార్టీపైనా, దేశ ప్రధానిపైనా, పార్టీ నాయకత్వంపైనా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Modi cheat, bad guy.. says heroine ..! Rafaels dealings are wrong

రాఫెల్ కుంభకోణంలో కేంద్రం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 12న కేంద్రం సమర్పించిన అఫిడవిట్ లో అనేక అసత్యాలు ఉన్నాయన్నారు. 36 యుద్ధ విమానాల ధరలను మధ్యలో మార్చారు ? అని ప్రశ్నించారు. కేంద్ర రక్షణ మంత్రి సిఫార్సులను ఎందుకు పక్కన పెట్టారు ? అని అడిగారు.

Modi cheat, bad guy.. says heroine ..! Rafaels dealings are wrong

126 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించి, 36 మాత్రమే ఎందుకు కొనాల్సి వచ్చిందన్నారు. రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు జరిగినప్పుడు పారదర్శకంగా జరగాలి. ఒకొక్క యుద్ధ విమానానికి రూ. 526 కోట్లు ఖర్చు అయితే, రూ.1670 కోట్లుగా చూపుతున్నారని ఆరోపించారు. మోదీ తమపై ఒత్తిడి తీసుకువచ్చి అనిల్ అంబానీకి అనుకూలంగా కాంట్రాక్టు వచ్చేలా చేశారని ప్రాన్స్ అధ్యక్షుడే బహిరంగంగా చెప్పారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ ఒప్పందాలన్ని వివాదాస్పదంగా మారుతున్నాయని రామయ్య తీవ్రంగా విమర్శించారు. ఏపీలో ఉప్పు నిప్పుగా వ్య‌వ‌మ‌రిస్తున్న టీడిపి - బీజెపి పార్టీలు తాజాగా వ‌ర్ల రామ‌య్య చేసిన ఆరోప‌ణ‌ల ప‌ట్ల క‌మ‌లం నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
Recently, in the BJP party the heroin Madhavi latha actively participated in the election campaign, The Bharatiya Janata Party has made serious criticism. Now her comments on social media have become a hot topic. on the other hand ap tdp criticized central bjp government in the rafeal deal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X