వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ సాహసోపేత ఆర్థిక ప్యాకేజ్..!అంతే సాహసోపేతంగా వ్యతిరేకించిన కేసీఆర్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎవరితో సఖ్యతగా ఉంటారో, ఎవరితో ఘర్షణపూరితంగా ఉంటారో చెప్పడం ఆ బ్రహ్మకు కూడా సాద్యం కాదు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఉపాది కోల్పోయిన రంగాలతో పాటు, ఆర్థికంగా చితికిపోయిన వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు. ఎందుకు పనికి రాని దిక్కుమాలిన ప్యాకేజీగా కొట్టిపారేసారు. నరేంద్ర మోదీ ఇస్తున్న ప్యాకేజీని ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రాలపై మోదీ చూపిస్తున్న చిన్నచూపుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని చంద్రశేఖర్ రావు పూటిగా ప్రశ్నించారు.

కేసీఆర్..కేంద్రం మధ్యలో జగన్ : కళ్లు మండేదెవరికి...: ఏపీ సీఎం అసలు టార్గెట్ అదే..!కేసీఆర్..కేంద్రం మధ్యలో జగన్ : కళ్లు మండేదెవరికి...: ఏపీ సీఎం అసలు టార్గెట్ అదే..!

 ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్.. ఓ దిక్కుమాలిన ప్యాకేజీగా అభివర్ణించిన కేసీఆర్..

ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్.. ఓ దిక్కుమాలిన ప్యాకేజీగా అభివర్ణించిన కేసీఆర్..

ప్రధాని మోడీతో స్నేహం చేస్తే అది కేంద్రానికే అనుకూలంగా ఉంటుంది తప్ప స్నేహంగా వ్యవహరిస్తున్న వాడికి ఎలాంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో గొప్పగా చెప్పుకున్న ప్యాకేజీని అత్యంత దుర్మార్గపు ప్యాకేజీగా అభివర్ణించారు. అంతే కాకుండా అత్యంత హేయంగా చిత్రీకరించారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వల్ల రాష్ట్రాలకు ఒరిగేదేమీ లేదని చంద్రశేఖర్ రావు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మొత్తాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత చంద్రశేఖర్ రావు పెద్ద యెత్తున విరుచుకుపడ్డారు.

 ముష్టి వేస్తామంటే తీసుకునే స్థితిలో లేము.. మోదీని కడిగిపారేసిన కేసీఆర్..

ముష్టి వేస్తామంటే తీసుకునే స్థితిలో లేము.. మోదీని కడిగిపారేసిన కేసీఆర్..

రాష్టాలకు కేంద్రం బిక్ష వేసినట్లు ప్రవర్తిస్తున్నదని, అంత దిగజారిపోయి వ్యవహరించడం ఏంటని చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. ఎఫ్ఆర్బీఎం పెంచమని కోరితే దానికి సవాలక్ష శరతులు విధించారని, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు, వాయిదాల చెల్లింపుల పట్ల పనికిమాలిన ఆంక్షలు విధించి, కేంద్రం నవ్వుల పాలైందని చంద్రశేఖర్ రావు ఘాటుగా విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ఉత్త బోగస్ ప్యాకేజీ అని దాంతో ఎవరికీ ఒరిగేది ఏమీ లేదని, చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్యాకేజీ నియంతృత్వంగా ఉందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. ఈ ప్యాకేజీ పట్ల దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వ్యతిరేకత వస్తోందని చంద్రశేఖర్ రావు దుమ్మెత్తిపోసారు.

 ఎవరికీ మేలు చేయని ప్యాకేజీ అది.. తెలంగాణకు అవసరం లేదన్న సీఎం..

ఎవరికీ మేలు చేయని ప్యాకేజీ అది.. తెలంగాణకు అవసరం లేదన్న సీఎం..

రాష్ట్రాల చేతుల్లోకి ప్రత్యక్షంగా నగదు వచ్చేలా ప్యాకేజీలు రూపొందించి ఉండి ఉంటే వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అభిప్రాయాన్ని చంద్రశేఖర్ రావు వ్యక్తం చేసారు. ఈ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా నరేంద్ర మోడీ తనలోని భూస్వామ్యవాద విధానాలను బయటపెట్టుకోవడం తప్ప మరేం కాదన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలోని అన్ని వ్యవస్థలు ప్రైవేట్ పరం అవుతాయని చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల నుంచి కేంద్రం సెస్ ల రూపంలో పన్నులు వసూలు చేసి రాష్ట్రాలను దివాళా దిశగా తీసుకెళ్తోందరి చంద్రశేఖర్ రావు మండి పడ్డారు.

 ఎంతరకంటే అంతవరకెళ్తాం.. కేంద్రంతో యుద్దానికి సిద్దమనే సంకేతాలిచ్చిన కేసీఆర్..

ఎంతరకంటే అంతవరకెళ్తాం.. కేంద్రంతో యుద్దానికి సిద్దమనే సంకేతాలిచ్చిన కేసీఆర్..

ఇక దేశ ప్రధాన మంత్రి మోదీ తీసుకున్న సంక్షేమ పథకం పట్ల ఇంతటి స్దాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరు. ప్రధాని తీసుకున్న నిర్ణయంలో ఐమైనా అవకతవకలు కనిపిస్తే అంతర్గంతా సలహాలు సూచనలు ఇస్తారు గాని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లాగా మీడియా సమావేశంలో కడిగి పారేసిన సందర్బాలు లేవు. దేశ ప్రధాని సాహసోపేతంగా తీసుకున్న 20లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని అంతే సాహసోపేతంగా వ్యతిరేకించిన తొలి ముఖ్యమంత్రి కూడా చంద్రశేఖర్ రావే కావడం విశేషం. బీజేపి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్ధిక ప్యాకేజీని ఓ దిక్కుమాలిన ప్యాకేజీగా అభివర్ణించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పట్ల బీజేపి ఎలా స్పందిస్తోననే అంశం ఆసక్తికరంగా మారింది.

English summary
Chandrasekhar Rao said that the package provided by the Center has nothing to do with the states. Chandrasekhar Rao broke down after a thorough study of the package announced by the Center Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X