India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ జీ.!యువ‌త ఉద్యోగ,ఉపాధి అవ‌కాశాల భ‌ర్తీపై మాట తప్ప లేదా?పీఎంకు కేటీఆర్ లేఖాస్త్రం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షలు, అలుపెరగని ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, తెలంగాణ యువత తరపున కీలకమైన అంశాన్ని తమరి దృష్టికి తీసుకువస్తున్నానంటూ దేశ ప్రదాని నరేంద్ర మోదీకి కేటీఆర్ లేఖ రాసారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపాదికైన నీళ్లు- నిధులు- నియామకాలు అనే కీలక అంశాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఎనిమిది సంవత్సరాలుగా గులాబీ ప్రభుత్వం అద్భుతమైన కృషి చేస్తున్నదని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాల కల్పన కోసం రెండంచెల వ్యూహంతో పనిచేస్తున్నామని ప్రధాని మోదీ కి కేటీఆర్ గుర్తు చేసారు.

 కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు..భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు..భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్


నూతన రాష్ట్రం అయినప్పటికీ వినూత్న, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు పెట్టుబడులుగా తెచ్చామన్నారు కేటీఆర్. త్రికరణశుద్దిగా చేస్తున్న ప్రయత్నాలతో ప్రైవేటురంగంలో సుమారు 16 లక్షల ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకుందన్నారు. భారత ప్రధానమంత్రిగా తమకు ఈ విషయంలో తగినంత సమాచారం ఉండే ఉంటుందని భావిస్తున్నానన్నారు కేటీఆర్. పారిశ్రామిక, ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని తమరి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే పలు వేదికలపై లెక్కలేనన్ని సార్లు ప్రశంసించిన విషయం మీకు తెలిసే ఉంటుందని ప్రదాని మోదీకి కేటీఆర్ గుర్తు చేసారు.

 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం అనర్ధం.. లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదమన్న కేటీఆర్

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం అనర్ధం.. లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదమన్న కేటీఆర్


కాని దేశ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో ప్రధానమంత్రిగా మీరు విఫలమయ్యారనే భావ‌న నెల‌కొన్న‌దని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్ధానాలు, చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తరువాత మర్చిపోయారన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎంతో గంభీరంగా మాట్లాడినదంతా ఢాంభికమే అనడానికి ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా క‌నిపిస్తున్న‌దని ఆగ్రహం వ్యక్తం చేసారు కేటీఆర్. మోదీ అసమర్థ నిర్ణ‌యాలు, అర్ధిక విధానాల‌తో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని ధ్వజమెత్తారు.

 దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పీఎం విఫలం.. ప్రధానికి లేఖాస్త్రం సంధించిన మంత్రి కేటీఆర్

దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పీఎం విఫలం.. ప్రధానికి లేఖాస్త్రం సంధించిన మంత్రి కేటీఆర్


సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని ఓ వైపు గప్పాలు కొడుతుంటే మీ పార్టీ నేతలు మాత్రం సబ్ కో సత్తేనాశ్ కరో అన్నట్టే వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వైఖ‌రి వ‌ల‌న కేవ‌లం దేశంలోనే కాకుండా వీదేశాల్లోని భార‌తీయుల ఉపాధికి ప్ర‌మాదం ఏర్పడుతున్న‌దన్నారు. పార్టీ విద్వేష రాజకీయాలతో పారిశ్రామికంగా వెనుకబడే ప్రమాదంలోకి మనదేశం వేగంగా వెళుతోందని, ఫలితంగా కోట్లాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందని మోదీని హెచ్చరించారు కేటీఆర్.గతంలో కూడా తెలంగాణకు వచ్చి తియ్యగ, పుల్లగ మాట్లాడారని, కాని పైసా సాయం చెయ్యలేదని ప్రధానిపై మండి పడ్డారు. కనీసం ఇప్పుడైనా తెలంగాణ గ‌డ్డ నుంచి దేశ యువ‌త‌కు ఉపాది-ఉద్యోగ క‌ల్ప‌న‌పై మీ వైఖ‌రి స్ప‌ష్టం చేయాలని కేటీఆర్ పీఎం కు రాసిన లేఖలో డిమాండ్ చేసారు.

 ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ.. ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించిన కేటీఆర్

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ.. ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించిన కేటీఆర్

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్, ప్రభుత్వ రంగంలోనూ ఇప్పటిదాకా సుమారు లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకోగలిగామని, తాజాగా మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టిపట్లు వివరించారు. తమది ఒట్టి మాటల ప్రభుత్వం కాదని, గట్టి చేతల ప్రభుత్వమని, ప్రజల చేతనే శభాష్ అనిపించుకుంటున్నామన్నారు కేటీఆర్. ఒక రాష్ట్రంగా మాకున్న పరిమిత వనరులతోనే భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మా ప్రజలకు కల్పిస్తున్నామని మోదీకి రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

English summary
KTR said that as the Prime Minister, you feel that you have failed to provide jobs to the people of the country. Modi's ineffective decisions and economic policies have not come up with new jobs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X