వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోది,కేసీఆర్ గంజి మీద వాలుతున్న ఈగలు.!అధికారం కోసం డ్రామాలాడుతున్నారన్న పొన్నాల.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నిన్నటి రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజని, ప్రధాని మోదీ వచ్చినప్పుడు సీఎం చంద్రశేఖర్ రావు తప్పించుకుని పొరుగు రాష్ట్రానికి వెళ్లడం అత్యంత దుర్మార్గమని మాజీ పీసీసీ అధ్యక్షుడు, పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. సాంప్రదాయ బద్దంగా ప్రధానికి స్వాగతం పలికి, అధికారిక సమావేశంలో పాల్గొని ఉండాల్సిందిన్నారు పొన్నాల. ఢిల్లీ వెళ్ళితే ప్రధాని అప్పోయింట్మెంట్ లేదని సీఎం చంద్రశేఖర్ రావు చెబుతారని, ఇక్కడికి ప్రధాని మోడీ వస్తే సీఎం చంద్రశేఖర్ రావు అందుబాటులో ఉండరని, ఇదెక్కడి వ్యవహారమన్నారు పొన్నాల.

 మోదీ, కేసీఆర్ లది దొంగ రాజకీయం.. రాజకీయ డ్రామాలన్న పొన్నాల లక్ష్మయ్య

మోదీ, కేసీఆర్ లది దొంగ రాజకీయం.. రాజకీయ డ్రామాలన్న పొన్నాల లక్ష్మయ్య

పీఎం, సీఎంలదంతా దొంగ రాజకీయమని, ప్రగతి సంక్షేమం, సమస్యల పరిష్కారం లేకుండా మోదీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యవహరిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేసారు. విస్మరించారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఇద్దరు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, ప్రధాని వచ్చినప్పుడు ఇక్కడి విభజన హామీలు, సమస్యలు, వడ్ల కొనుగోలు అంశాన్ని ప్రధానికి చెప్పకుండా సీఎం ఎక్కడికో పోయాడని పొన్నాల మండి పడ్డారు.

 తెలంగాణ అంశాలు చర్చించరా.?సీఎం ఎందుకు వెనకాడుతున్నారన్న పొన్నాల

తెలంగాణ అంశాలు చర్చించరా.?సీఎం ఎందుకు వెనకాడుతున్నారన్న పొన్నాల

ప్రధాని వచ్చినప్పుడు తెలంగాణ అంశాలు చర్చించకుండా ఎందుకు వెనుకాడుతున్నారని, మోడి, చంద్రవేఖర్ రావు రాజకీయ డ్రామాలు కట్టిపెట్టాలన్నారు పొన్నాల.
మోదీ వచ్చి చేసినవి, చేయబోయేవి, గతంలో ఇచ్చిన హామీల గురించి ఏమైనా చెప్పాడా అని నిలదీసారు. ఐఎస్బీ స్నాతకోత్సవంలో పట్టాలు ఇచ్చిన ప్రధాని, మీ పట్టాలు ఎక్కడ ఉన్నాయి.? మీ పట్టా గురించి మాట్లాడతారా మోడీ.?పట్టాల పంపిణీకి మోడీ అర్హుడా.? ప్రధానిగా గౌరవిస్తామన్నారు పొన్నాల.

 కేసీఆర్ పై మోదీ అవినీతి ఆరోపణలు.. విచారణకు ఎందుకు ఆదేశించరన్న పొన్నాల

కేసీఆర్ పై మోదీ అవినీతి ఆరోపణలు.. విచారణకు ఎందుకు ఆదేశించరన్న పొన్నాల


స్వయంగా ప్రధాని చంద్రశేఖర్ రావు పై అవినీతి వ్యాఖ్యలు చేసారని, మాటలకు పరిమితం కాకుండా సీఎం పై అవినీతిని వెలికి తీసి ప్రధాని చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు పొన్నాల. అన్ని దర్యాప్తు సంస్థలు తన గుప్పెట్లో ఉంచుకుని, దర్యాప్తుకు ఆదేశించే అధికారం ఉండి కూడా విమర్శలతో సరిపెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీసారు. ప్రధాని దగ్గర చంద్రశేఖర్ రావు అవినీతిపై ఆధారాలు వుంటే రాష్ట్రపతి పాలన పెట్టి చంద్రశేఖర్ రావు పై విచారణ జరిపించాలన్నారు పొన్నాల.

 అవినీతి సొమ్ముతో దేశ పర్యటన.. తెలంగాణ సీఎం పొన్నాల ధ్వజం

అవినీతి సొమ్ముతో దేశ పర్యటన.. తెలంగాణ సీఎం పొన్నాల ధ్వజం


అవినీతి సొమ్ముతో దేశ పర్యటన చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి సీఎం చంద్రశేఖర్ రావు అని పొన్నాల మండిపడ్డారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడకుండా, ప్రధాని మోదీ కేవలం రాజకీయ అంశాలపై మాట్లాడడం దుర్మార్గమన్నారు పొన్నాల. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో రాష్ట్ర పర్యటనలో చెప్పలేదన్నారు. మోడి, చంద్రశేఖర్ రావులు గంజి మీద వాలుతున్న ఈగలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు చెంపదెబ్బ కొట్టే రోజులు దగ్గర్లో వున్నాయన్నారు పొన్నాల లక్ష్మయ్య.

English summary
Former PCC president Ponnala Lakshmaiah said it was "extremely wrong" for CM Chandrasekhar Rao to escape and go to a neighboring state when Prime Minister Modi arrives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X