India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోదీ ప్రధానిలా కాదు - సేల్స్ మెన్ లా : నా ప్రభుత్వాన్ని పడగొడతారా - ఢిల్లీలోనే దించేస్తాం : సీఎం కేసీఆర్ ఫైర్.

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రధాని కేసీఆర్.. ప్రధాని మోదీ పైన విరుచుకుపడ్డారు. మోదీ విధానాల పైన మండిపడ్డారు. మహారాష్ట్ర తరహాలో తెలంగాణ ప్రభుత్వాన్ని దించేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని.. అదే చేయంది. ఢిల్లీనే దించేసే శక్తి తెలంగాణకు ఉందంటూ హెచ్చరించారు. తెలంగాణ జోలికి వస్తే.. ఏం జరుగుతుందో చూడండంటూ హెచ్చరించారు. రాష్ట్రపతి అభ్యర్ది యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్.. ఆయన సమక్షంలో ప్రధాని పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. సిన్హా ను కేసీఆర్ ప్రశంసిచారు. ఆయన సేవలను కొనియాడారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీ తీరును తప్పు బడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

తొమ్మది ప్రభుత్వాలు కూల్చేసారు

తొమ్మది ప్రభుత్వాలు కూల్చేసారు

ప్రధాని సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారంటూ మండిపడ్డారు. మత ద్వేషాలతో దేశాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. మోదీ ప్రధానిలా కాదు - సేల్స్ మెన్ లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. తాము ఇక మౌనంగా కూర్చోలేం - ఖచ్చితంగా పోరాడుతామని తేల్చి చెప్పారు. దేశంలో ఏం జరుగుతోందనేది ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆకస్మికంగా కరోనా వేళ లాక్ డౌన్ ప్రకటించారని విమర్శించారు. తమ పైన రాజకీయంగా దాడి చేసేందుకు వస్తున్న ప్రధాని మోదీ.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రధాని అయ్యే సమయంలో అనేక హామీలు ఇచ్చారని.. ఒక్కటీ అమలు చేయలేదన్నారు. దేశం మొత్తం ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తోందంటూ దుయ్యబట్టారు. అందరి ఆదాయాలు పడిపోయి.. ఖర్చుల పెరగటం మోదీ పాలనలో ఘనతగా చెప్పుకొచ్చారు.

దేశ గౌరవం - ప్రతిష్ఠను దిగజార్చుతున్నారు

దేశ గౌరవం - ప్రతిష్ఠను దిగజార్చుతున్నారు


దేశ గౌరవం - ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. దేశంలోరాజకీయ పరివర్తన ఖాయంగా వస్తుందని.. ఎవరూ శాశ్వతం కాదని చెప్పుకొచ్చారు. తానే శాశ్వతం అని మోదీ అనుకుంటున్నారని.. దేశంలో ప్రజాస్వామం ఉందని గుర్తించాలని హెచ్చరించారు. ఎన్నుకున్న ప్రభుత్వాలకు కూల్చుతున్నారని.. ఇప్పటి వరకు 9 ప్రభుత్వాలను కూల్చారన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా శ్రీలంకలో నిరసనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. తనకు వ్యక్తిగతంగా మోదీ తో ఏ పంచాయితీ లేదన్నారు. అమెరికా వెళ్లి అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల తరహాలో ట్రంప్ కు మద్దతుగా ప్రచారం చేసారని.. దేశ ప్రతిష్ఠను దిగజార్చారని ఫైర్ అయ్యారు.

సిన్హాను గెలిపిస్తే గౌరవం పెరుగుతుంది

సిన్హాను గెలిపిస్తే గౌరవం పెరుగుతుంది


ఎన్నికలప్పుడు తియ్యని మాటలు చెబుతారని.. ఆ తరువాత ప్రజల పైన భారం మోపుతారని ధ్వజమెత్తారు. ఎరువులు - నిత్యావసరాల ధరలు పెంచారు..ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. రూపాయి విలువ ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. మేకిన్ ఇండియా అంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయటమేనా అని నిలదీసారు. మోదీ పాలనలో ఆర్దిక వ్యవస్థ కుప్పకూలుతోందని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు 30 లక్షల కోట్లు రాష్ట్రాల నుంచి తీసుకున్నారని విశ్లేషించారు. ప్రధాని పైన జనంలో ఆగ్రహం పెరుగుతోందని వివరించారు. ఇదేనా మనం కోరుకున్న దేశం అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.

English summary
CM KCR fires on PM Modi ahead of BJP Executive meetings and PM Arrival in Hyderabad. KCR appeal for support YAswant Sinha in Presidental elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X