హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్వరమే పూర్తి చేయండి: హైదరాబాద్-యాదాద్రిపై మోడీ హామీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ రైలుమార్గం విస్తరణకు సాయం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఈ పనులను సత్వరమే చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రధాని బుధవారం ఢిల్లీ నుంచి అన్నిరాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దూరదృశ్య విధానంలో సమీక్షించారు. తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ ఇందులో పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ రైల్వే ప్రాజెక్టులు, అమృత్‌ పట్టణాలు చర్చకు రాగా... యాదాద్రి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోందని సీఎస్‌ వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందనీ, రూ.500 కోట్లకుపైగా వెచ్చిస్తోందని చెప్పారు.

ప్రాజెక్టుకు అవసరమైన భూమిని గుర్తించామనీ, శివార్లలో భూసేకరణకు ప్రతిబంధకాలున్నాయని తెలిపారు. కాగా, రైల్వే, రక్షణశాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు

Modi on Hyderabad-Yadadri mmts

గడువులోగా పూర్తి చేయండి

హైదరాబాద్‌ - సికింద్రాబాద్‌ ప్రాంతంలో చేపడుతున్న ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు. త్వరగా పూర్తి చేస్తే.. పెరిగే వ్యయాన్ని అరికట్టొచ్చని, ప్రజలకు సమయానికి అందించగలమని అభిప్రాయపడ్డారు. ఫలక్‌నుమా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుదాకా, మౌలాలీ నుంచి ఘట్‌కేసర్‌ దాకా రూ.838 కోట్లతో ప్రతిపాదించిన లైనును 2017 డిసెంబరు కల్లా పూర్తి చేయాలన్నారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై ప్రపంచ బ్యాంకు ఇటీవల ప్రకటించిన నివేదికను అన్ని రాషా్ట్రల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు అధ్యయనం చేయాలని, తమ రాష్ట్రాలల్లో సులభంగా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని గుర్తించి, నెల రోజుల్లో నివేదిక తయా రు చేయాలన్నారు. దీనిపై సమీక్ష జరపాలని కెబినెట్‌ కార్యదర్శికి ప్రధాని ఆదేశించారు. వచ్చే ఏడాది నెల రోజుల ముందే బడ్జెట్‌ రానున్నందున ప్రాజెక్టులు, పథకాల అమలును వేగం చేయాలన్నారు.

కార్మికుల సమస్యలపై సున్నితంగా ఉండాలి

సులభతర వాణిజ్యానికి అనుకూల వాతావరణం కలిగిన దేశాల జాబితాలో భారత్‌కు 130వ స్థానం దక్కడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ప్రపంచబ్యాంకు తాజా నివేదికలో 190 దేశాల్లో భారత్‌కు 130వ స్థానం దక్కిన నేపథ్యంలో పరిస్థితిని విశ్లేషించాలనీ, మెరుగుదల, సంస్కరణలు చేపట్టాల్సిన అంశాలపై విశ్లేషణ జరపాలని కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులను ఆదేశించారు.
వివిధ కార్యక్రమాలు, పథకాల అమలుపై చర్చించేందుకు రాష్ట్రాల అధికారులతో నేరుగా అనుసంధానమయ్యే నెలవారీ 'ప్రగతి' సమావేశంలో ప్రధాని ప్రపంచబ్యాంకు నివేదికను ప్రస్తావించారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లోనూ సంస్కరణలు చేపట్టాలన్నారు. ప్రపంచబ్యాంకు నివేదికను అధ్యయనం చేసి మెరుగుదలకు అవకాశమున్న ప్రాంతాల్ని విశ్లేషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించినట్లు పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ అంశంలో సంబంధిత అధికారులందరి నుంచీ నెల రోజుల్లో నివేదికను కోరారనీ, తర్వాత దానిని సమీక్షించాలని క్యాబినెట్‌ కార్యదర్శికి తెలిపారని వెల్లడించింది. గత ఏడాది భారత్‌ 130వ స్థానంలో నిలవగా, ఈసారి కూడా ఆ స్థానం మారలేదు.

ఈపీఎఫ్‌ లబ్ధిదారుల ఫిర్యాదులపై ఆందోళన

కార్మికులు, ఈపీఎఫ్‌ లబ్ధిదారుల ఫిర్యాదులు పెద్దసంఖ్యలో ఉండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల అవసరాల విషయంలో ప్రభుత్వాలు సునిశితంగా వ్యవహరించాలన్నారు. ఉద్యోగులందరి పదవీ విరమణ ప్రయోజనాలన్నింటినీ ఏడాది ముందేను తుది ఖరారు చేసే ప్రక్రియ చేపట్టేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

అకాల మరణం కేసుల్లో పత్రాల్ని నిర్దిష్ట వ్యవధిలో పూర్తి చేయాలనీ, అధికారులను బాధ్యులుగా చేయాలన్నారు. కార్మిక, ఉద్యోగిత శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, పరిష్కార పద్ధతులపై ప్రగతి సమావేశంలో చర్చించామనీ, ఇందులో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని ట్వీట్‌ చేశారు.

English summary
Prime Minister Narendra Modi on Wednesday responded on on Hyderabad Yadadri mmts railway line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X