హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీఎంఓ గ్రీన్ సిగ్నల్, మన మెట్రోకు లైన్ క్లియర్: 28నే ప్రారంభించనున్న మోడీ

మెట్రో ప్రారంభంపై ఉన్న అన్ని అనుమానాలు తీరిపోయాయి. ఇప్పటికే సీఎంఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు ప్రధాని కార్యాలయం కూడా స్పష్టతనిచ్చేసింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi's visit confirmed to launch Hyderabad Metro

హైదరాబాద్: మెట్రో ప్రారంభంపై ఉన్న అన్ని అనుమానాలు తీరిపోయాయి. ఇప్పటికే సీఎంఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు ప్రధాని కార్యాలయం కూడా స్పష్టతనిచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది.

మెట్రో కబుర్లు: అమీర్‌పేట్ టు మియాపూర్.. జస్ట్ 20 నిమిషాలే, ప్రయాణికులకు నిబంధనలివీ...మెట్రో కబుర్లు: అమీర్‌పేట్ టు మియాపూర్.. జస్ట్ 20 నిమిషాలే, ప్రయాణికులకు నిబంధనలివీ...

అమెరికా మెట్రో రైల్లో మన తెలుగమ్మాయి! ఓ పుస్తకంతో వెలుగులోకి...అమెరికా మెట్రో రైల్లో మన తెలుగమ్మాయి! ఓ పుస్తకంతో వెలుగులోకి...

 28నే ప్రధాని మోడీ రాక

28నే ప్రధాని మోడీ రాక

ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలు.. నవంబర్ 28న, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనతో వస్తారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.

 మెట్రోలో ప్రయాణం

మెట్రోలో ప్రయాణం

అనంతరం 3.25కి వారంతా మియాపూర్‌ మెట్రోరైల్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. మోడీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లికి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్‌కు వస్తారు. ఆ తర్వాత స్టేషన్‌ ఆవరణలో ఈ ప్రాజెక్టుపై ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు.

మన మెట్రో ఘనతలు: ఎన్నో అవార్డులు, ఆదాయమూ భారీగానే! మన మెట్రో ఘనతలు: ఎన్నో అవార్డులు, ఆదాయమూ భారీగానే!

 అంతర్జాతీయ సదస్సు.. ఫలక్‌నుమాలో విందు..

అంతర్జాతీయ సదస్సు.. ఫలక్‌నుమాలో విందు..

అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. అక్కడ విందు అనంతరం రోడ్డు మార్గంలోనే 8.30కి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళతారు.

 కట్టుదిట్ట భద్రత మధ్య నగరం

కట్టుదిట్ట భద్రత మధ్య నగరం

గవర్నర్‌, సీఎం ఇతర ప్రముఖులు ఆయనకు వీడ్కోలు పలికిన అనంతరం... ప్రత్యేక విమానంలో మోడీ ఢిల్లీకి బయల్దేరతారు. హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్‌నుమాకు రోడ్డు మార్గమే భద్రం, అనుకూలమని ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) నివేదిక ఇవ్వడంతో... ప్రధాని కార్యాలయం అందుకు మొగ్గు చూపినట్లు తెలిసింది. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, అంతర్జాతీయ సదస్సు కోసం వస్తున్న వివిధే దేశాల ప్రతినిధుల పర్యటన దృష్ట్యా నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులు దాదాపూ పూర్తి చేశారు.

English summary
It’s official now. Prime Minister Narendra Modi will be launching the Hyderabad Metro Rail project at metro rail station at Miyapur on November 28. A communication to this effect was received by the Telangana police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X