వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాకీల వడ్డీ దందా: ఎఎస్సై మోహన్ రెడ్డి బినామీ శ్రీనివాస్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కరీంనగర్ లో ఏఎస్సైగా పనిచేస్తూ అక్రమ వడ్డీ వ్యాపారాలు కొనసాగిస్తూ దందా నడిపిన మోహన్‌రెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్న హోంగార్డు శ్రీనివాస్‌ను గురువారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ ప్రస్తుతం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.

ఏఎస్సై మోహన్‌రెడ్డి దగ్గర కొమురయ్య అనే వ్యక్తి రూ. 4లక్షలను అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఆయన సకాలంలో చెల్లించకపోవడంతో దాదాపు రూ. 7లక్షల విలువచేసే ఇంటిని హోంగార్డు శ్రీనివాస్ పేరిట మోహన్‌రెడ్డి రిజిస్టర్ చేయించాడు. దీంతో ఆయన అక్రమ దందాకు హోంగార్డు శ్రీనివాస్ బినామీగా ఉన్నాడనే కారణంతో అతన్ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

Mohan Reddy's benami srinivas arrested

కాగా, ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న సీఐడీ కానిస్టేబుల్ పర్శరాములు గౌడ్, వసూల్ రాజా పహిల్వాన్ పర్మిందర్‌సింగ్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఏఎస్సై మోహన్‌రెడ్డిపై సీఐడీ అధికారులు నమోదు చేసిన రెండో కేసులో బుధవారం కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.

దొనపాటి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు 25/2015 కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగళవారం ఏ4 నిందితుడు శ్రీధర్‌రెడ్డిని హాజరుపర్చిన సీఐడీ అధికారులు, ఏ1 మోహన్‌రెడ్డిని హాజరుపర్చేందుకు బుధవారం ఉదయం పిటి వా రెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

కరీంనగర్ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అజహర్ హుస్సే న్ అనుమతి ఇవ్వడంతో జిల్లా జైలులో ఉన్న మోహన్‌రెడ్డిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ కేసులో మోహన్‌రెడ్డికి వచ్చే నెల 1 వరకు రిమాం డ్ విధించడంతో తిరిగి జైలుకు తరలించారు.

English summary
Karimnagar ASI Mohan Reddy's binami has been arrested by CID slueths. Two key persons Parasharamulu Goud and Parminder Singh in ASI Mohan Reddy's finance business are still absconding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X