హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లీకొడుకు ప్రాణం తీసిన వాషింగ్ మిషన్: కట్టేయడంతో నిలిచిన కూతురు ప్రాణం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పీఎస్ పరిధిలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వారాసిగూడ ముంతాజ్ కేఫ్ సమీపంలోని ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో దుస్తులు వేసేందుకు వెళ్లిన మహిళ‌కు షాక్ తగిలింది.

ఇది గమనించిన ఆమె కొడుకు.. తల్లికేదో అయిందని ఆమెను పట్టుకున్నాడు. ఈ ప్రమాదంలో తల్లి అలిమున్నీసా(25), కొడుకు జునైద్(3) ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కాగా, వాషింగ్ మెషీన్ అసెంబుల్డ్ చేసింది కావడం, దాని తీగలు అక్కడక్కడ సక్రమంగా లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, మృతురాలి ఏడాదిన్నర కూతురు ఈ ప్రమాదం నుంచి బయటపడింది. అల్లరిచేస్తున్న ఏడాదిన్నర కూతురును అటుఇటు జరగకుండా కట్టేసి వచ్చిన తల్లి.. ఈ ప్రమాదానికి గురైంది. దీంతో ఆ చిన్నారి కదలకుండా అక్కడే ఉండిపోవడంతో ప్రాణాలు దక్కించుకుంది.

వివరాల్లోకి వెళితే.. వారాసిగూడలోని పాతజ్యోతి మోడల్‌ స్కూల్‌ భవనంలో అసీఫ్ ఖాన్‌ తన భార్య మున్నీసా (25), కుమారుడు జునైద్‌ రెహ్మాన్‌ (03), ఏడాదిన్నర పాప తబుశంలతో నివసిస్తున్నాడు. అతను మెదక్‌ జిల్లా చేగుంటలో ఫిజియోథెరఫీ వైద్యునిగా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం మున్నీసా దుస్తులు వాషింగ్‌ మిషన్‌లో వేసి, కరెంట్‌ ఆన్‌ చేసింది. వాషింగ్‌ మిషన్‌కు ఎర్త్‌ లేకపోగా... మిషన్‌ కింద నేలపై నీరు నిలిచి ఉంది. దీంతో దుస్తులు బైటికి తీసేందుకు వెళ్లిన ఉన్నీసాకు వాషింగ్‌ మెషీన్‌తో పాటు, నేలపై నిలిచిన నీటి ద్వారా కూడా కరెంట్‌ షాక్‌ కొట్టింది.

కిందపడిన తల్లి పరిస్థితి చూసి దగ్గరకు వెళ్లిన కుమారునికి కూడా షాక్‌ తగిలింది. ఇద్దరూ వెంటనే మృతి చెందారు. కిందపడిన తల్లి, అన్నలను చూసి చిన్నారి తబుశం గుక్క పెట్టి ఏడుస్తుండటంతో స్థానికులు లోనికి వచ్చారు. సమాచారం అందుకొన్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తల్లి, కొడుకుల మృతదేహాల్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం మార్చురీకి తరలించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తన కుమార్తె, మనవడి చావుకు అల్లుడే కారణమని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. గతకొన్ని రోజులుగా ఆసీఫ్ ఖాన్‌ తన కుమార్తె మున్నీసాను వేధిస్తున్నాడని, నాలుగు నెలలుగా జామద్‌కు వెళ్లిన అసిఫ్ ఖాన్‌ గురువారం రాత్రి వారాసిగూడకు వచ్చి తన కుమార్తెతో గొడవపడి వెళ్లాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కాగా. అల్లరి చేస్తున్న చిన్నారి తబుశంను తల్లి మున్నీసా తాడుతో మంచం మీద కట్టివేయటంతో ఆ చిన్నారి ప్రమాదాన్ని తప్పించుకొంది. తల్లి కట్టి వేయకుండా ఉంటే పాప కూడ వారిని తాకి ప్రాణాలు విడిచేదని స్థానికులు చెబుతున్నారు.

తల్లీకొడుకు మృతి

తల్లీకొడుకు మృతి

హైదరాబాద్ నగరంలోని చిలకలగూడ పీఎస్ పరిధిలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది.

తల్లీకొడుకు మృతి

తల్లీకొడుకు మృతి

స్థానిక వారాసిగూడ ముంతాజ్ కేఫ్ సమీపంలోని ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో దుస్తులు వేసేందుకు వెళ్లిన మహిళ‌కు షాక్ తగిలింది.

తల్లీకొడుకు మృతి

తల్లీకొడుకు మృతి

ఇది గమనించిన ఆమె కొడుకు.. తల్లికేదో అయిందని ఆమెను పట్టుకున్నాడు. ఈ ప్రమాదంలో తల్లి అలిమున్నీసా(25), కొడుకు జునైద్(3) ప్రాణాలు కోల్పోయారు.

తల్లీకొడుకు మృతి

తల్లీకొడుకు మృతి

ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
A mother and son died due to electrocution at Boudhanagar in Chilkalguda on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X