వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు డిగ్గీ కౌంటర్, పార్టీ మారిన వారిపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజాప్రతినిధులను కొంటున్నారని, కాంట్రాక్టులు, స్వార్థం కోసమే తమ పార్టీకి చెందిన నేతలు తెరాసలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ బుధవారం రాత్రి మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు జీ వివేక్, వినోద్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు కారు ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై డిగ్గీ స్పందించారు. బంగారు తెలంగాణ ముసుగులో ప్రజాప్రతినిధులను కొంటున్నారని ఆరోపించారు. భారీ కాంట్రాక్టులు పొందేందుకు, స్వప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రాజెక్టుల్లో నిర్మాణ వ్యయాన్ని రెండు, మూడింతలు పెంచి అవినీతికి తలుపులు తెరిచారన్నారు. దీనిపై వచ్చే వారం కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. మల్లన్న సాగర్ సహా అన్ని ప్రాజెక్టుల కింద నిర్వాసితులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

రాష్ట్రంలో అసలైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయేనని, తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని దిగ్విజయ్ సింగ్ అన్నారు

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

తమ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను బాహటంగా కొనేస్తున్నారన్నారు. రాజకీయ ఫిరాయింపులకు కెసిఆర్ బాధ్యత వహించాలన్నారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

కొంతమంది నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు చెక్కుచెదరకుండా ఉన్నారన్నారు. నాయకులు, ఎమ్మెల్యేలు వారి స్వలాభాపేక్ష, వ్యాపారాల నిమిత్తం పార్టీ ఫిరాయించారన్నారు. అయితే వెళ్ళిన నాయకులు ఎన్నికలకు ముందు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉన్నందున, వారిని వెనక్కి తీసుకోరాదని పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

తెలంగాణలో పార్టీకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని డిగ్గీ రాజా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. పార్టీ నాయకులెవ్వరూ పరస్పరం విమర్శలు చేసుకోరాదన్నారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

తెలంగాణలో పార్టీకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని డిగ్గీ రాజా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. పార్టీ నాయకులెవ్వరూ పరస్పరం విమర్శలు చేసుకోరాదన్నారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్యేలను బహిరంగంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి విరుద్ధమన్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేసినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారన్నారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఆ చట్టంలో గడువేమి లేదని, ఇది చట్టంలో ఉన్న లోపమేనన్నారు. కాబట్టి ఫిరాయింపుల పిటీషన్లపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా చట్ట సవరణ జరగాల్సి ఉందన్నారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

English summary
Hitting out at TRS president K. Chandrasekhar Rao for luring party MP and Legislators, AICC general secretary in-charge of Telangana, Digvijay Singh said the party let go of those who wanted to turn politics into a ‘dhanda’ (business).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X