వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైళ్లను ఎక్కడికక్కడే ఆపేసిన ఓ కోతి

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: విద్యుత్‌ తీగలపై కోతి ఫీట్లు చేయటంతో వైర్లు తెగిపడ్డాయి. దీంతో వరంగల్‌ - విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎల్గూరు రంగంపేట రైల్వేస్టేషన్‌లో బుధవారం తెల్లవారుజామున ఓకోతి విద్యుత్‌ హైటెన్షన్‌ వైరును పట్టుకుని వేలాడటంతో వైరుతెగి పెద్దఎత్తున మంటలు లేచాయి.

దీంతో వరంగల్‌ - విజయవాడ మార్గంలో ట్రాక్షన్‌ ట్రిప్‌ అయి సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ ఘటనతో అప్రమత్తమైన నెక్కొండ, కాజీపేట ఓహెచ్‌ సూపర్‌వైజర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని తెగిన విద్యుత్తు వైరును మరమ్మతు చేశారు.

Monkey stops all the trains

నెక్కొండ స్టేషన్‌లో సింహపూరి ఎక్స్‌ప్రెస్‌, కేసముద్రంలో రఫ్తిసాగర్‌, తమిళనాడు, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో శాతవాహన, మహబూబాబాద్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేశారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.

రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు కారణం తెలియక ఇబ్బందులకు గురయ్యారు. గూడ్స్ వ్యాగన్ మీదకు ఎక్కిన కోతి అక్కడి నుంచి ఎగురుతూ విద్యుత్తు కాంటాక్ట్ వైర్‌ను పట్టుకుంది. దాంతో విద్యుత్తు తీగె తెగి అంతరాయం ఏర్పడింది.

English summary
A monkey stopped all the trains between Vijayawada and Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X