హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణించిన వరుణుడు: హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం, ట్రాఫిక్ జామ్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను వరుణుడు కరుణించాడు. గురువారం నగరంలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాలు కురిస్తే తప్ప పంటలు కాపాడుకోవడం క‌ష్ట‌మ‌ని రైతులు క‌ల‌వ‌ర‌ప‌డుతోన్న స‌మ‌యంలో వర్షాలు పడటం సంతోషానికి గురి చేస్తోంది.

బంగాళాఖాతంలో రెండు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నాలు ఏర్పడ్డాయ‌ని, ఉత్త‌ర‌, ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నాలు కొన‌సాగుతున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప‌శ్చిమ‌ బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

Monsoon rain in Hyderabad until August end

దీనికి తోడుగా ఈనెల 26న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ దిశగా ముందుకు కదిలే వీలున్నందున శక్రవారం ప్రత్యేకించి ఉత్తర కోస్తాలో పలుచోట్ల విస్తారంగా, శనివారం కోస్తా, తెలంగాణ లోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వీటి ప్ర‌భావంతోనే తెలుగు రాష్ట్రాల్లో చెదురుముదురుగా వ‌ర్షాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. దీంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, మెహదీపట్నం, టోలీచౌకితో పాటు దిల్‌షుక్ నగర్, హయత్‌నగర్‌ మండలంలోనూ పలుచోట్ల వర్షం కురుస్తోంది.

నగరంలో వాతావరణంఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదరకంగా మారిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్ల‌పై నిలిచిన నీళ్ల‌తో కూడ‌ళ్ల వ‌ద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

English summary
Hyderabad received moderate to heavy rain during last few days of July however, August was not that blessed. Scattered rain that was witnessed during first few days of August completely bid adieu to Hyderabad and other parts of Telangana, leaving a trail of dry weather in the region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X