హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో 1,27వేలకు పైగా కరోనా కేసులు ..24 గంటల్లో 2,734 కొత్త కేసులు,9 మరణాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఏపీతో పోలిస్తే చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నా , నేటికే రోజూ వేల సఖ్యలో కేసులు నమోదు ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో చాలా జిల్లాలలో కరోనా ఇప్పటికే విస్తరించింది. చాలావరకు ప్రజలు ఇళ్లలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నారు .అధికారికంగా కంటే, అనధికారికంగా ఉన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు . ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు 1,27 వేలకు పైగా చేరింది .

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంట్లలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 2,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,27,697కు చేరుకుంది.ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 9 మంది మృతి చెందగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 836 మంది మృత్యువాత పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది . ప్రస్తుతం రాష్ట్రంలో 31,699 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,162 మందికి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,325 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కరోనా సీరియస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

More than 1,27 thousand corona cases in telangana.. 2734 cases in a single day

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనాకేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 347 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి 212, నల్లగొండ జిల్లాలో 191 కేసులు , నిజామాబాద్ జిల్లాలో 144 కేసులు , మేడ్చల్ జిల్లాలో 112 కేసులు , వరంగల్ అర్బన్లో 112 కేసులు , సిద్దిపేట 109 కేసులు , సూర్యాపేట 107 కేసుల చొప్పున అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలో లక్షణాలు లేని కరోనా పాజిటివ్ కేసులే ఎక్కువగా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

English summary
Corona cases are increasing in Telangana state. 2,734 positive cases has been registered in the state in last 24 hours . cases increasing creates tension to the telangana government . major cases reported in GHMC premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X