వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలిచిన అభ్య‌ర్థుల్లో ఎక్కువ మంది నేర‌చ‌రితులే..! ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఆరోప‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించింది. మాజిక్ ఫిగ‌ర్ ను దాటి అత్య‌దిక సీట్ల‌ను సాదించి ప్ర‌తిపక్షాల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అంతే కాకుండా స్వ‌తంత్య్రంగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అదికార పార్టీలో చేరేందుకు సుముఖ‌త చూపుతుండ‌డంతో ఇక ఆ పార్టీ మెజారిటీ 90కి ఎగ‌బాక‌డ‌మే కాకుండా ఎదురులేని పార్టీగా అత‌రించింది. ఇంత వ‌ర‌కు క‌థ సుఖాంతంగా ఉన్నా గెలిచిన అదికార పార్టీలో ఎక్కువ మంది నేర‌చ‌రితులు ఉన్నారంటూ ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ బాంబ్ పేల్చింది. గెలిచిన అభ్య‌ర్తుల్లో పార్టీ ల ప‌రంగా ఎంత మంది నేర చరితులు ఉన్నారో నివేదిక బ‌య‌ట‌పెట్టింది గుడ్ గ‌వ‌ర్నెన్స్ సంస్థ‌.

 అతి పెద్ద పార్టీ గా టీఆర్ఎస్..! తెలంగాణ‌లో ఊహించ‌ని మెజారిటీ..!

అతి పెద్ద పార్టీ గా టీఆర్ఎస్..! తెలంగాణ‌లో ఊహించ‌ని మెజారిటీ..!

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే 60 మంది శాసనసభ్యుల మద్దతు ఉంటే చాలు. ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి బలం 88. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయకుండానే మరో ఇద్దరు స్వతంత్రులు వచ్చి చేరడంతో ఆ బలం 90కి చేరింది. దీంతో అదికార గులాబీ పార్టీ తెలంగాణ‌లో అత్యంత బ‌ల‌మైన పార్టీ గా అవ‌త‌రించింది.

 గెలిచిన అభ్య‌ర్థుల్లో నేర‌చ‌రితులు ఉన్నారంటున్న ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్..!

గెలిచిన అభ్య‌ర్థుల్లో నేర‌చ‌రితులు ఉన్నారంటున్న ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్..!

అయితే ఇదే శాసనసభలో నేర చరిత్ర కలిగిన సభ్యుల బలం కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ. తెలంగాణ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో అన్ని పార్టీల నుంచి మొత్తం 67 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికయ్యారు. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్ధ కన్వీనర్ పద్మనాభరరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుత శాసనసభలో సివిల్, క్రిమినల్ కేసులు ఉన్న సభ్యులు 67 మంది ఉన్నారు.

టీఆర్ఎస్ అభ్య‌ర్థుల్లో ఎక్కువ గా నేర చ‌రిత్రులు..! ఈసి కి ఫిర్యాదు చేస్తామంటున్న ప‌ద్మ‌నాభ‌రెడ్డి..!

టీఆర్ఎస్ అభ్య‌ర్థుల్లో ఎక్కువ గా నేర చ‌రిత్రులు..! ఈసి కి ఫిర్యాదు చేస్తామంటున్న ప‌ద్మ‌నాభ‌రెడ్డి..!

నేర చరిత్ర ఉన్న శాసనసభ్యుల్లో టీఆర్ఎస్ వారే అధికంగా ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఎన్నికైన 88 మంది ఎమ్మెల్యేలలో 44 మందిపై పలు కేసులు ఉన్నాయని, బీజేపీ నుంచి ఎన్నికైన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎన్నో కేసులున్నాయని ఆయన అన్నారు. ఇక ప్రజాకూటమి నుంచి గెలిచిన 21 మందిలో 16 మందిపై కేసులుండగా ఎంఐఎం నుంచి గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై పెండింగ్ కేసులు ఉన్నాయని అన్నారు.

అదికార పార్టీ ఎలా స్పందిస్తుందో..! నేర చ‌రితుల‌ను ఎలా క‌ట్ట‌డి చేస్తుందో చూడాలి..!

అదికార పార్టీ ఎలా స్పందిస్తుందో..! నేర చ‌రితుల‌ను ఎలా క‌ట్ట‌డి చేస్తుందో చూడాలి..!

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసుల గురించి ప్రధాన పత్రికలు, టీవీ చానళ్లలో కనీసం మూడు సార్లు ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును అత్యధికులు పాటించలేదని పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తామని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి తెలిపారు. దీంతో నేర చ‌రిత్ర ఉన్న నేత‌ల‌కు ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం లేక‌పోలేదు.

English summary
The Forum for Good Governance Bomb exploded that there were more criminals in the trs party. The Good Governance Agency has revealed how many candidates have won criminal cases in terms of winning party candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X