వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకా వచ్చెన్..: సగం టైమ్ 'రిజర్వ్' లోనే.. ఆ టైమ్ వరకు హోటల్లోనే.. ఆ తర్వాతే?

హెచ్‌ఐసీసీకి అతి సమీపంలో ఉండటం వల్లే ట్రైడెంట్ హోటల్ నే బస కోసం ఇవాంకా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ivanka Trump arrived in Hyderabad for GES 2017, Watch

హైదరాబాద్: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ లో అడుగుపెట్టారు.

అమెరికాప్రతినిధులు, డెలిగేట్ల బృందంతో కలిసి ఎయిర్ పోర్టులో ఆమె అడుగుపెట్టారు. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. నలుపు రంగు దుస్తుల్లో కనిపించిన ఇవాంకా.. అక్కడి నుంచి నేరుగా ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు.

ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..

 18గం. రిజర్వ్:

18గం. రిజర్వ్:

మంగళవారం తెల్లవారుజామున 3గం. నుంచి బుధవారం రాత్రి 9.20 గంటల వరకు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన కొనసాగుతుంది. సుమారు 40 గంటల పాటు సాగే ఈ పర్యటనలో 40గం. రిజర్వ్‌ టైమ్‌గానే కేటాయించడం గమనార్హం. మంగళవారం మధ్యాహ్నాం 2.50గం. వరకు ఇవాంకా హోటల్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సమయాన్ని 'రిజర్వ్' టైమ్ కేటగిరిలోనే పేర్కొన్నారు.

హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా, ఘన స్వాగతం: రోడ్డు మార్గంలోనే ట్రైడెంట్ హోటల్‌కు హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా, ఘన స్వాగతం: రోడ్డు మార్గంలోనే ట్రైడెంట్ హోటల్‌కు

 ఆ హోటల్లోనే ఎందుకంటే?:

ఆ హోటల్లోనే ఎందుకంటే?:

హెచ్‌ఐసీసీకి అతి సమీపంలో ఉండటం వల్లే ట్రైడెంట్ హోటల్ నే బస కోసం ఇవాంకా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కేవలం పది నిమిషాల్లో హెచ్ఐసీసీకి చేరుకోవచ్చు. మధ్యాహ్నాం 3గం. తర్వాత ప్రధాని మోడీతో కలిసి ఆమె సదస్సులో పాల్గొననున్నారు. అదే సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో 3.10-3.25గం. వరకు భేటీ అవుతారు. రాత్రి భారత ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చే విందుకు హాజరవుతారు.

 ప్లీనరీ సెషన్‌లో ప్రసంగం:

ప్లీనరీ సెషన్‌లో ప్రసంగం:

సదస్సు రెండో రోజైన బుధవారం ఉదయం ప్లీనరీ సెషన్‌లో ఇవాంకా ప్రసంగిస్తారు. అనంతరం హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్‌ హోటల్లో భేటీ అవుతారు. సాయంత్రం 5:35 గంటలకు ఇవాంకా హోటల్ ఖాళీ చేస్తారు. రాత్రి 8.20కి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళ్తారు.

 కాన్వాయ్ రిహార్సల్స్:

కాన్వాయ్ రిహార్సల్స్:

ఇవాంకా పర్యటన నేపథ్యంలో సోమవారం రాజేంద్రనగర్‌లో కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు పైనుంచి భారీ కాన్వాయ్‌ హిమాయత్‌సాగర్, రాజేంద్రనగర్, పీడీపీ చౌరస్తా, శివరాంపల్లి, ఆరాంఘర్, మైలార్‌దేవ్‌పల్లి, బండ్లగూడ మీదుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌ వరకు నిర్వహించారు. మంగళవారం రాత్రి ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇవాంకా డిన్నర్ కు హాజరవుతుండటంతో ఈ మార్గంలో కాన్వాయ్ రిహార్సల్స్ చేపట్టారు. దాదాపు 40 వాహనాలతో ఉదయం 10 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు మరోసారి రిహార్సల్స్‌ నిర్వహించారు.

English summary
United States President Donald Trump's daughter and advisor Ivanka Trump arrived at the Rajiv Gandhi International Airport in Hyderabad early Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X