వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాధి నయం గాక తల్లీ, అమ్మ లేని జీవితం ఎందుకని కొడుకు : ఇద్దరి మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీశైలం : క్యాన్సర్ రక్కసి ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వ్యాధి నయం కాదని తల్లి ఊపిరి వదలగా ... తల్లి లేని జీవితం తనకేందుకు అనుకున్న కుమారుడు కూడా తనువు చాలించాడు. ఈ విషాద ఘటన శ్రీశైలం సమీప అడవుల్లో చోటుచేసుకుంది.

ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం... హత్య !ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం... హత్య !

క్యాన్సర్ రక్కసి చిచ్చు ..

క్యాన్సర్ రక్కసి చిచ్చు ..

సూర్యాపేటకు చెందిన చిత్రం మాధవి (34) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. వ్యాధికి సంబంధించి హైదరాబాద్‌లోనూ చికిత్స తీసుకుంది. తన వ్యాధి నయం కాదని భావించిన ఆమె చనిపోవాలని డిషిసన్ తీసుకుంది. కుమారుడు కార్తీక్ తో కలిసి ఆరురోజుల క్రితం శ్రీశైలం వచ్చింది. వారిద్దరూ సాక్షి గణపతి ఆలయ సమీపంలోని అడవుల్లోకి వెళ్లారు. అప్పటికే తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు, కొన్ని మందులు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.

6 రోజుల క్రితమే మ‌ృతి

6 రోజుల క్రితమే మ‌ృతి

వీరి మృతికి సంబంధించిన సమాచారం బంధువులను సమాచారం అందించారు. తల్లికొడుకులు ఆరురోజుల క్రితం చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. వారి మృతదేహాలను అడవి జంతువులు ఈడ్చుకెళ్లడంతో భాగాలు దెబ్బతిన్నాయి.

విఫల ప్రయత్నం ..

విఫల ప్రయత్నం ..

కనిపించకుండా పోయిన మాధవి, కార్తీక్‌ల ఆచూకీ కోసం బంధువులు విశ్వప్రయత్నాలు చేశారు. శ్రీశైలం పరిసరాల్లో గోడప్రతుల ద్వారా ప్రచారం చేశారు. వారం తర్వాత మాధవి, కార్తీక్‌ విగతజీవులుగా కనిపించడంతో బోరున విలపించారు.

English summary
Madhavi (34) suffers from cancer. Treatment also took place in Hyderabad for the disease. She felt that her disease would not be cured son took her to die. Srisailam arrived six days ago with his son Karthik. Both of them went to the nearby forests of Ganpati temple. Some of the medicines have already committed suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X