వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా తలలో పాప్‌కార్న్ వేసి వేధించారు, ఏం చేయాలి?: కొడుక్కి తల్లి గుణపాఠం! (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ రోజుల్లో లైంగిక వేధింపులు అనే పదం నిత్యం వినిపిస్తున్న పదం. వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు లైంగిక వేధింపులకుగురవుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు.. అందర్నీ మానసికంగా, భౌతికంగా వేధింపులకు గురి చేసే వారి గురించి రోజూ వార్తలు చదువుతున్నాం.

అయితే, ఇలాంటి లైంగిక వేధింపులను అదుపు చేసేందుకు... యువతకు కుటుంబ సభ్యుల సహకారం అవసరమని చాలామంది భావిస్తున్నారు. తల్లి లేదా తండ్రి... తమ ఇంట్లోని యువతకు లైంగిక వేధింపులు తప్పు అనే విషయాన్ని తెలియజెప్పాలని అంటున్నారు.

భారత్ వంటి దేశాల్లో లైంగికపరమైన అంశాలను చర్చించకోవడం తప్పుగా భావిస్తారని, తండ్రి కొడుకు, తల్లి కొడుకుల మధ్య ఇలాంటి సంభాషణ తప్పుగా భావిస్తారని, కానీ జరగాల్సిన పద్ధతిలో చర్చ జరిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా బ్రేక్ త్రో ఇండియా అనే సంస్థ ఓ నిమిషం లోపు నిడివి గల వీడియోను ఇంటర్నెట్లో ఉంచింది. అందులో ఓ తల్లి తన కొడుకుకు తన లైంగిక వేధింపు బాధను చెబుతుంటుంది. తద్వారా పిల్లలకు తల్లి ఎలా చెప్పొచ్చో దీని ద్వారా సూచించారు.

Mother teaches son a lesson about sexual harassment in less than a minute

ఆ వీడియోలో... ఓ విద్యార్థిని పాఠశాలకు వెళ్తుండగా ఓ యువకుడు ఆమె తల పైన పూవులు జల్లుతాడు. ఆ అమ్మాయి కోపంతో.. వాటిని దులిపేసుకొని వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఓ ఆంటీ వస్తుంది. అప్పుడు కూడా అతడు అలాగే చేయబోతాడు.

అంతలోనే ఆ యువకుడి అమ్మ బట్టలు ఆరవేసేందుకు బయటకు వచ్చి.. తన కొడుకు చేస్తున్న దానిని గమనిస్తుంది. ఆ సమయంలో ఆ కొడుకుతో తల్లి సంభాషణ జరుగుతుంది. నేను ఒకటి చెప్పానా అని తల్లి అనగా, చెప్పు అని కొడుకు అడుగుతాడు.

నేను ఆఫీసుకు వెళ్తుంటే నా పైన కొందరు కుర్రాళ్లు పాప్ కార్న్ విసిరేశారని, నేను వెనక్కి తిరిగి చూశానని, బైక్ పైన కూర్చున్న వాళ్లు... తన వద్దకు వచ్చారని, 'మేడం.. సారీ మా పాప్ కార్న్ మీ తలలో చిక్కుకుపోయింది, తీసుకోమంటారా' అని అడిగారని, అప్పుడు నేను ఏం చేయాలని ఆ తల్లి కొడుకుతో అంటుంది. తిరిగి మాట్లాడుతూ.. అందుకే ఎవరి విషయంలోను అనుచితంగా ప్రవర్తించవద్దని కొడుకుకు చెబుతుంది.

#shareyourstory with your son

Conversations about #sexualharassment do not happen within families. Watch this video to see how communication between a mother and son about sexual harassment can have a lasting impact on the son.#shareyourstory https://www.inbreakthrough.tv/campaigns/shareyourstory/

Posted by Breakthrough India on Tuesday, November 17, 2015

English summary
Sexual harassment is a term we often hear. We understand what it means and always root against it, but what we fail to understand is we unknowingly let our children, or family members practice it when we do not make them realise any form or physical or psychological abuse, including bullying, falls under it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X