వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోత్కుప‌ల్లి స్వ‌యంక్రుతాప‌రాధం.. పార్టీకి ద‌గ్గ‌ర కాలేని ప‌రిస్థితి

|
Google Oneindia TeluguNews

Recommended Video

బాబు పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో విభేదాలు మ‌రోసారి భ‌గ్గు మ‌న్నాయి. పార్టీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి నర్సింహులు త‌న‌ను పార్టీ అదినేత చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా విస్మ‌రిస్తున్నార‌ని, త‌న సీనియారిటీకి కూడా గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని ఘాటుగా విమ‌ర్శించారు. చంద్ర‌బాబు మోత్కుప‌ల్లి ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించి నిర‌శ‌న తెలుపుతాన‌ని హెచ్చ‌రించారు. ఈ వాఖ్య‌ల‌తో వ్య‌వ‌హారాన్ని మ‌రింత జ‌ఠిలం చేసుకున్నారు మోత్కుప‌ల్లి.

 చంద్ర‌బాబు పిలిస్తే పార్టీలోకి వ‌స్తా, పార్టీకోసం ప‌నిచేస్తా..

చంద్ర‌బాబు పిలిస్తే పార్టీలోకి వ‌స్తా, పార్టీకోసం ప‌నిచేస్తా..

తెలుగుదేశంలో మోత్కుపల్లి నర్సింహులు కథ ముగిసినట్లే కనిపిస్తోంది. ఆయనను పట్టించుకోమన్న సంకేతాలను ఆ పార్టీ నాయకత్వం ఇచ్చింది. మోత్కుపల్లిని క్షమించే ఉద్దేశం టీడీపీకి లేనట్లు అర్థమౌతోంది. పార్టీ పైన ఎంత ఒత్తిడి తీసుకువచ్చినప్పటికి జాతీయ నాయకత్వం కాని, రాష్ట్ర నాయకత్వం కాని కనీసం స్పందించడం లేదు. తెలంగాణ మహానాడుకు నర్సింహులను ఆహ్వానించలేదు. విజయవాడలో జరిగే జాతీయ మహానాడు కూడా పిలవరని తేలిపోయింది. తెలుగుదేశంలో కొనసాగాలని మోత్కపల్లి తహతహలాడుతున్నప్పటికి పార్టీ మాత్రం పట్టించుకునే మూడ్‌ లో లేదు.ఆయనపై స్పందించకపోవడం ద్వారా వదిలించుకునే ఆలోచనలో తెలుగుదేశం ఉన్నట్లు స్పష్టమౌతోంది. దీంతో మోత్కుపల్లి ఇరవై ఐదేళ్ల టీడీపీ ప్రయాణం బలవంతంగా మూగబోతుంది.

 చంద్ర‌బాబుకు అన్నీ తెల‌సు.. కావాల‌నే నన్ను విస్మ‌రిస్తున్నారు..

చంద్ర‌బాబుకు అన్నీ తెల‌సు.. కావాల‌నే నన్ను విస్మ‌రిస్తున్నారు..

నిజానికి ఇది మోత్కుపల్లి స్వయంక్రుతాపరాధం. గవర్నర్ పదవి ఇప్పించలేదన్న ఆగ్రహంతో ఆయన పార్టీ మీద నోరు జారారు. అది కూడా తెలంగాణలో టీడీపీ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కేడర్ మనోభాావాలను నర్సింహులు తునాతునకలు చేశారు. అనేక ఆటుపోట్ల మధ్య తెలంగాణలో టీడీపీని కాపాడుకుంటు వస్తున్న కార్యకర్తలు, నాయకుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసారు. తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న ఆయన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వం నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరికి ఆగ్రహన్ని తెప్పించింది. వాస్తవానికి మోత్కుపల్లి నర్సింహులకు టీడీపీలో మంచి క్రేజ్ ఉంది. రేవంత్ రెడ్డి తర్వాత ఆయన ప్రసంగానికే ఎక్కువ మంది అభిమానులున్నారు. నయానో భయానో ఆయన మాటే పార్టీలో నెగ్గేది.

మోత్కుప‌ల్లి వైఖ‌రి రాష్ట్ర నాయ‌త్వానికి ఇబ్బందిక‌రంగా మారింద‌న్న అనుమానాలు..

మోత్కుప‌ల్లి వైఖ‌రి రాష్ట్ర నాయ‌త్వానికి ఇబ్బందిక‌రంగా మారింద‌న్న అనుమానాలు..


టీడీపీ,బీజేపీ మధ్య సంబంధాలు సజావుగా ఉంటే కచ్చితంగా మోత్కుపల్లి గవర్నర్ అయ్యే వారే. కాని చంద్రబాబును మోదీ లెక్క చేయకపోవడంతో ఆయనకు పదవి రాలేదు. నర్సింహులుకు గవర్నర్ పదవి ఇవ్వాలని బాబు బీజేపీ అధిష్టానానికి సిఫార్సు కూడా చేశారు. అయినప్పటికి మోదీ పట్టించుకోలేదు. పార్టీ పరిస్థితి బాగుంటే 2019లో కచ్చితంగా మోత్కుపల్లికి కేంద్ర స్థాయిలో మంచి పదవి వచ్చేది. కాని అసహనంలో ఉన్న నర్సింహులు ఒక్క మాటతో అన్నింటిని కాలరాసుకున్నారు. తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు ఆయన పదే పదే చెపుతున్నప్పటికి విరిగిన తెలుగు తమ్ముళ్ల మనసులు మాత్రం కరగడం లేదు. పార్టీ మీద అభిమానాన్ని చంపుకోలేక మోత్కుపల్లి అధినేత పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు మోత్కుపల్లిని వదిలించుకోవాలని తెలంగాణ నాయకత్వం బలంగా భావిస్తోంది. ఆయనతో వేగలేమని పార్టీ ముఖ్యనేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ కు మళ్ళీ నర్సింహులు టీడీపీ కార్యాలయానికి రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయన మోత్కుపల్లి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లడం లేదు.

అధినాయ‌కత్వం స్పందించ‌కుంటే అమ‌రావ‌తిలో నిర‌శ‌న తెలుపుతా...

అధినాయ‌కత్వం స్పందించ‌కుంటే అమ‌రావ‌తిలో నిర‌శ‌న తెలుపుతా...

పార్టీ రాష్ట్ర నాయకులంతా కలిసి కట్టుగా చంద్రబాబు వద్దకు వెళ్తే ఒక్క రోజు నర్సింహులు అంశం తేలిపోతుంది. మొత్తానికి మోత్కుపల్లిని వదిలించుకోవడానికి తెలుగుదేశం సిద్ధమైంది. అయితే నర్సింహులు ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఫోటో తో ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ టీడీపీ నుంచి నాయకులు వలసపోతుంటే ఉంటానంటున్న మోత్కుపల్లిని మాత్రం ఆ పార్టీ గెంటేసే ప్రయత్నం చేస్తోంది.

English summary
telangana telugudesam senior leader motkupalli narasimhulu again fired on chandrababu. motkupalli seriously alleged that chandrababu naidu wantedly keeping him away from the party. He said that still he is ready to work with tdp party if chandrababu commands him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X