వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి, మోత్కుపల్లిపై చర్యలు: రమణ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

వికారాబాద్:టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖను టిఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ సూచించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే చర్యలు తీసుకొనే యోచనలో పార్టీ ఉందని రమణ అభిప్రాయపడ్డారు.

మోత్కుపల్లికి షాక్: వివరణ కోరనున్న టిడిపి, ఆ ఘటనపై కేంద్ర కమిటీకి నివేదికమోత్కుపల్లికి షాక్: వివరణ కోరనున్న టిడిపి, ఆ ఘటనపై కేంద్ర కమిటీకి నివేదిక

జనవరి 18వ, తేదిన టిడిపి తెలంగాణ శాఖను టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన తర్వాత నర్సింహులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపాయి.

టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, ఇంత కంటే అవమానమా:బాబుపై మోత్కుపల్లి సంచలనంటిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, ఇంత కంటే అవమానమా:బాబుపై మోత్కుపల్లి సంచలనం

ఈ వ్యాఖ్యలు తెలంగాణ టిడిపి శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని రేపాయి. ఈ విషయమై టిడిపి తెలంగాణ రాష్ట్ర పొలిట్ బ్యూరో సమావేశాన్ని శనివారం నిర్వహించారు. మోత్కుపల్లి నర్సింహులు నుండి ఈ వ్యాఖ్యలపై వివరణ కోరాలని నిర్ణయించారు.

మోత్కుపల్లిపై చర్యలు తీసుకొనే యోచనలో టిడిపి

మోత్కుపల్లిపై చర్యలు తీసుకొనే యోచనలో టిడిపి

మాజీ మంత్రి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖను టిఆర్ఎస్ లో విలీనం చేయాలని చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సూచించారు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడంతో ఈ మేరకు రమణ ఈ సూచన చేశారు

మోత్కుపల్లిపై చర్యకు టిడిపి యోచన

మోత్కుపల్లిపై చర్యకు టిడిపి యోచన

టిడిపి రాష్ట్ర శాఖను టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు టిడిపి క్యాడర్‌ను గందరగోళంలో పడేశాయి. ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే మోత్కుపల్లి నర్సింహులుపై చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉన్నట్టు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు.మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలను ప్రజలెవరూ కూడ ఒప్పుకోరని ఎల్. రమణ చెప్పారు.

ప్రగతి భవన్ ను ప్రజా ఆసుపత్రిగా మార్చాలి

ప్రగతి భవన్ ను ప్రజా ఆసుపత్రిగా మార్చాలి

ప్రగతి భవవన్ ను ప్రజా ఆసుపత్రిగా మార్చాలని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ డిమాండ్ చేశారు ప్రగతి భవన్ పైరవీ భవన్‌గా మారిందని రమణ ఆరోపించారు. ప్రజా ధనాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ముందుండేదని, ప్రస్తుతం టిఆర్ఎస్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తోందని రమణ అభిప్రాయపడ్డారు.

మోత్కుపల్లి ఏం చేస్తారు

మోత్కుపల్లి ఏం చేస్తారు

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నర్సింహులు చేసిన వ్యాఖ్యలు పార్టీపై తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పార్టీ వివరణ కోరితే వివరణ ఇస్తారా, లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. శనివారం జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి కూడ నర్సింహులు హజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతోనే ఈ సమావేశానికి హజరుకాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ కోరినట్టు ఈ వ్యాఖ్యలను నర్సింహులు వెనక్కు తీసుకొంటారా, లేదా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది

English summary
TDP Politburo member Motkupalli Narasimhulu comments should be taken back to merge the TDP Telangana state branch in TRS Tdp Telangana state president Ramana suggested. he spoke to media on Sunday at vikarabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X