వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌కు షాక్: 'షోకాజ్‌ ఇవ్వాల్సిందే', 'ఆ ప్రకటనలో స్పష్టత లేదు', లిస్టు రెఢీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహరం టిడిపిలో ఇంకా చిచ్చు రేపుతోంది. తాను చంద్రబాబుతో సమావేశం కానున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మీడియాలో వస్తున్న వార్తలపై రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ప్రకటనపై తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ పెదవి విరిచారు. ఈ ప్రకటనలో స్పష్టత లేదన్నారు. మరో వైపు టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశంలో రేవంత్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని మోత్కుపల్లి నర్సింహ్ములు డిమాండ్ చేశారు.

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని కలిశారని వచ్చిన వార్తలపై రేవంత్‌రెడ్డిని తీవ్రంగా ఖండించారు.కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్యులతో సమావేశమైన రేవంత్‌రెడ్డి తనపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు.

రేవంత్‌రెడ్డి వ్యవహరంపై తెలంగాణ టిడిపి నేతలు చర్చించారు. అయితే రేవంత్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కొందరు నేతలు పట్టుబట్టారు. అయితే రేవంత్ పార్టీ మారడం లేదని చేసిన ప్రకటనపై కూడ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ పెదవి విరిచారు.

రేవంత్ ప్రకటనలో స్పష్టత లేదు

రేవంత్ ప్రకటనలో స్పష్టత లేదు

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి యూ టర్న్ తీసుకొన్నారు. కొడంగల్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విదేశాల నుండి వచ్చిన తర్వాత తాను సమావేశం కానున్నట్టు రేవంత్ ప్రకటించారు. తనపై మీడియాలో వస్తున్న వార్తలను రేవంత్‌రెడ్డి ఖండించారు.అయితే ఈ ఆరోపణలపై తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు. ఈ ప్రకటనలో స్పష్టత లేదన్నారు.

రేవంత్‌కు షోకాజ్ ఇవ్వాలన్న మోత్కుపల్లి

రేవంత్‌కు షోకాజ్ ఇవ్వాలన్న మోత్కుపల్లి

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యవహరంపై తెలంగాణ టిడిపి పొలిట్‌బ్యూరో పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైంది.ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయమై చర్చించారు. రేవంత్ కారణంగా పార్టీ నష్టపోయిందని చర్చించారు. పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న రేవంత్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని మోత్కుపల్లి నర్సింహ్ములు డిమాండ్ చేశారు.అయితే రేవంత్ వివరణ ఇచ్చిన తర్వాత షోకాజ్ నోటీసు అవసరం లేదని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు.మరోవైపు రేవంత్ ప్రకటనలో కూడ స్పష్టత లేదని మోత్కుపల్లి నర్సింహ్ములు అభిప్రాయపడ్డారు.

పార్టీ క్యాడర్‌కు సానుకూల సంకేతాలు

పార్టీ క్యాడర్‌కు సానుకూల సంకేతాలు


పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వడం ద్వారా క్యాడర్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు అవుతోందని ఈ సమావేశంలో మోత్కుపల్లి నర్సింహ్ములు అభిప్రాయపడ్డారు. పార్టీకి నష్టం కల్గిస్తే పార్టీ కోసం ఇంతకాలం పాటు శ్రమించినవారికి ఏ రకంగా న్యాయం చేసినట్టు అవుతోందని నర్సింహ్ములు ప్రశ్నించారని సమాచారం. షోకాజ్ నోటీసు ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు అవుతోందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరే నేతల జాబితాను తయారు చేశాం

కాంగ్రెస్ పార్టీలో చేరే నేతల జాబితాను తయారు చేశాం


కాంగ్రెస్ పార్టీలో చేరే నేతల జాబితాను తయారు చేసినట్టు టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న నేతల జాబితా తయారు చేశామన్నారు. అంతేకాదు ఇతర పార్టీల నేతలను కలిసిన నేతల జాబితాను కూడ తయారు చేసినట్టు చెప్పారు.ఈ రెండు జాబితాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందించనున్నట్టు ఎల్. రమణ చెప్పారు.

English summary
Telangana Tdp president L. Ramana said that Revanth Reddy statement not clarify on rumours join in congress. He spoke to media on Sunday.TTdp leaders meeting at NTR Bhavan on Sunday. Motkupalli Narasimhulu demanded give show cause notice to Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X