హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్! ఓ మోసకారి, డబ్బుల సంచులతో దొరికాడు: మోత్కుపల్లి సంచలనం

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న విషయం దాదాపు ఖరారైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలియకుండా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న విషయం దాదాపు ఖరారైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలియకుండా కాంగ్రెస్ నేతలను ఎలా కలిశారంటూ రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డికి పార్టీ ప్రయోజనాల కన్నా.. వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. రేవంత్ పార్టీని వీడినా నష్టమేమీ లేదని, టీడీపీ మరింత బలోపేతమవుతుందని అన్నారు.

వాడీవేడి భేటీ: రేవంత్-మోత్కుపల్లి తీవ్ర వాగ్వాదం, వాకౌట్, లోకేష్ ఎంక్వైరీవాడీవేడి భేటీ: రేవంత్-మోత్కుపల్లి తీవ్ర వాగ్వాదం, వాకౌట్, లోకేష్ ఎంక్వైరీ

బాబు ఎంతో నమ్మారు..

బాబు ఎంతో నమ్మారు..

శుక్రవారం మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. చంద్రబాబు అనుమతి లేకుండా కాంగ్రెస్ నేతలను కలిసేందుకు నీ స్థాయి ఏంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబునాయుడు ఎంతో నమ్మారని, అందుకే మమ్మల్ని కాదని టీడీపీలో కీలక పదవిని కట్టబెట్టారని అన్నారు.

రేవంత్.. సమాధానమివ్వు

రేవంత్.. సమాధానమివ్వు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారా? లేదా? అంటే రేవంత్ రెడ్డి నుంచి సమాధానం రావడం లేదని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. టీడీపీకి చెందిన ఏపీ మంత్రులు పరిటాల సునీత, యనమల రామకృష్ణుడుపై తీవ్రమైన ఆరోపణలు ఎలా చేస్తారంటూ రేవంత్ రెడ్డిని మోత్కుపల్లి ప్రశ్నించారు.

డబ్బుల సంచులతో దొరికావు..

డబ్బుల సంచులతో దొరికావు..

ఓటుకు నోటు కేసులో డైరెక్టుగా డబ్బుల సంచులతో దొరికారంటూ రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వల్లే తెలుగుదేశం పార్టీకి 22శాతం ఉన్న ఓట్ల శాతం 7శాతానికి పడిపోయిందని ఆరోపించారు.

రేవంత్ వల్లే ఆ 12మంది వెళ్లిపోయారు..

రేవంత్ వల్లే ఆ 12మంది వెళ్లిపోయారు..

అంతేగాక, రేవంత్ రెడ్డి వల్లే ఎర్రబెల్లి దయాకర్ రావు సహా 12మంది సీనియర్ నేతలు టీడీపీని వీడారని మోత్కుపల్లి ఆరోపించారు. స్టార్ క్యాంపెయిర్ అని చెప్పుకుంటున్న రేవంత్ వల్ల మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలుపు లభించలేదని విమర్శించారు.

చంద్రబాబును నమ్మించి మోసం చేశావు..

చంద్రబాబును నమ్మించి మోసం చేశావు..

చంద్రబాబును నమ్మించి మోసం చేశారని రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ను చేసి రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అయినా రేవంత్ ఇలా మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీని అమ్మే ప్రయత్నం..

పార్టీని అమ్మే ప్రయత్నం..

రేవంత్ వల్లే తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటి పడిపోయిందని మోత్కుపల్లి ఆరోపించారు. రేవంత్ రెడ్డి పార్టీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మిగితా నేతలను కూడా తనవెంటే తీసుకెళ్లేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మంచోడిగా నటించి మోసం చేశారని, తన పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుడే రేవంత్ వెళ్తారని అర్థమైంది..

అప్పుడే రేవంత్ వెళ్తారని అర్థమైంది..

రాహుల్ గాంధీని కలిస్తే తప్పేంటి? అన్నప్పుడే రేవంత్ పార్టీని వీడుతున్నట్లు తెలిసిపోయిందని మోత్కుపల్లి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. ఆయనను కలిసి జరిగిన పరిణామాలను వివరిస్తామని మోత్కుపల్లి తెలిపారు.

రాజకీయ స్వార్థంతోనే..

రాజకీయ స్వార్థంతోనే..

మరో టీడీపీ సీనియర్ నేత అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదిన మీడియాకు చెప్పమని అడిగితే.. రేవంత్ దాటవేస్తున్నారని అన్నారు. రాజకీయ స్వార్థంతోనే రేవంత్ ఇలా చేస్తున్నారని అన్నారు. గౌరవమిచ్చి పార్టీలో ముందు నిలబెడితే ఇలా చేస్తారా? అంటూ మండిపడ్డారు. పార్టీతో ఉండి 26ఏళ్లైనా తాను ఏ పదవిని ఆశించకుండా పనిచేస్తున్నానని తెలిపారు. రేవంత్ వైఖరి నచ్చకే శుక్రవారం జరిగిన కీలక సమావేశం నుంచి వాకౌట్ చేశామని అరవింద్ కుమార్ తెలిపారు.

English summary
Telangana TDP senior leader Motkupally Narasimhulu on Friday lashed oud at MLA Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X