నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ పసుపు బోర్డుకు లైన్ క్లియర్ అన్న ఎంపీ అరవింద్ .. ఎలెక్షన్ స్టంట్ అంటున్న టీఆర్ఎస్

|
Google Oneindia TeluguNews

మున్సిపల్ ఎన్నికలు సమరం తెలంగాణా రాష్ట్రంలో జోరుగానే కొనసాగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ విజయం నమోదు చేసి గులాబీ పార్టీ జెండా ఎగురవెయ్యాలని వ్యూహాత్మకంగా ముందు వెళుతుంది. ఇక ఇదే సమయంలో తమకు పట్టున్న నియోజకవర్గాల్లో అయినా సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. నిజామాబాద్ రైతులకు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది బీజేపీ .అయితే టీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది.

 పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా బోర్డు డైరెక్టర్ల నియామకం

పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా బోర్డు డైరెక్టర్ల నియామకం

గత లోక్ సభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రైతులకు ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తున్న నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోందని చెప్తున్నారు. పండుగ రోజు కేంద్రం తీపి కబురు అందించిందని చెప్పారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ . నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్‌ అధికారులను కేంద్రం నియమించిందని పేర్కొన్నారు .

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో వెల్లడించలేదన్న ఎంపీ

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో వెల్లడించలేదన్న ఎంపీ

న్యూ ఢిల్లీ లోని లోధి ఎస్టేట్, ఒబెరాయ్ హోటల్ లో పియూష్ గోయల్ ప్రెస్ మీట్ కు ఏర్పాట్లు చేశారనీ అయితే చివరి నిమిషంలో ఆయన ప్రెస్ మీట్ రద్దయిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రెస్ మీట్ నిర్వహించలేదని, కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు కేంద్రమంత్రికి సూచన చేశారనీ చెప్పారు. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీచేస్తామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపిందని అరవింద్ అన్నారు.

 త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ అన్న బీజేపీ ఎంపీ అరవింద్

త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ అన్న బీజేపీ ఎంపీ అరవింద్

త్వరలో నిజామాబాద్ పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరబోతోందని పేర్కొన్నారు ఎంపీ అరవింద్ . ఎన్నికల కోడ్ తర్వాత అధికారిక ప్రకటన వస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ కేంద్రంగా తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ వ్యవస్థను కూడా కేంద్రం ఏర్పాటు చేయనుందని చెప్తున్నారు. ఏది ఏమైనా నిజామాబాద్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎంపీ అరవింద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి విజయం అందించాలని కోరుతున్నారు.

ఎలెక్షన్ స్టంట్ అంటున్న టీఆర్ఎస్

ఎలెక్షన్ స్టంట్ అంటున్న టీఆర్ఎస్


అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ అని బీజేపీ ఎంపీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం ఒప్పుకుంది అని చెప్తున్నారని గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లోసత్తా చాటిన బీజేపీ, నిజామాబాద్ లో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్న నేపధ్యంలోనే ఈ తరహా ప్రచారానికి దిగిందని టీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పక్కా ఎలెక్షన్ స్టంట్ అని మండిపడుతున్నారు. ప్రజలు ఎవరూ ఎంపీ అరవింద్ మాటలను నమ్మవద్దని కోరుతున్నారు.

English summary
Nizamabad MP Dharmapuri Arvind said that the Center has appointed IAS officers as board directors to set up the turmeric board in Nizamabad. But all this is an election stunt says the trs party . this is nothing but vote bank politics of BJP in minicipal elections TRS countered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X