వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం ఫోరం సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ... సీఏఏ, ఎన్‌ఆర్‌సీల అమలుపై ఓవైసీ బ్రీఫింగ్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను నెలకొన్న నేపథ్యంలోనే ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఏఏ అమలు ఇతర అంశాలు చర్చించేందుకు ఆయన యునైటైడ్ ముస్లిం ఫోరం సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. మధ్యహ్నాం మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది.

సమావేశం అనంతరం ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ... ఎన్‌ఆర్సీతో పాటు సీఏఏ ను వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్టు తెలిపారు. వాటిని రాష్ట్రంలో అమలు చేయవద్దని సీఎంకు లేఖ సమర్పించినట్టు చెప్పారు. దీంతో తాము చేసిన విజ్ఝప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని.. ఈనేపథ్యంలోనే అయితే వీటి అమలుకు ఇతర రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్ చెప్పారని ఓవైసీ ప్రకటించారు.

 mp asaduddin owaisi met cm kcr along with united muslim forum

కాగా కేంద్ర చట్టాలపై ఈ నెల 27న నిజమాబాద్‌లో బహిరంగ సభను నిర్వహిస్తామని ఎంపీ అసదుద్దిన్ ప్రకటించారు. కాగా ముస్లీం ఫోరం సమావేశంలో అసదుద్దిన్ తో పాటు రాష్ట్ర హోమంత్రి మహమూద్ ఆలీ , ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేలు అక్పరుద్దిన్ , పాషా ఖాద్రీలు సైతం పాల్గోన్నారు.

English summary
mp asaduddin owaisi met cm kcr along with united muslim forum members . and he requested not to implement CAA and NRC in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X