వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హైకోర్టు విభజించండి', 'ఏపీలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు బాబు సమ్మతి'

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

హైకోర్టు విభజన పై రచ్చ ! ap లో త్వరలోనే !

హైదరాబాద్:హైకోర్టు విభజనపై పార్లమెంట్‌లో గురువారంనాడు మరోసారి టిఆర్ఎస్ ప్రస్తావించింది.టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి మరోసారి ప్రస్తావించారు. టిఆర్ఎస్ ఎంపీల వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి సూచన చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు.అమరావతితో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

హైకోర్టు విభజన అంశంపై రెండు రోజు కూడ టిఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి గురువారం నాడు ప్రస్తావించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలనే అంశాన్ని జితేందర్ రెడ్డి గుర్తు చేశారు. అయితే జడ్జీల కేటాయింపులో కూడ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Mp Jithender Reddy demands for high court bifurcation

అయితే జడ్జీల కేటాయింపు వ్యవహరాన్ని కొలిజియం చూస్తోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబునాయుడు సంసిద్దతను వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు.

అయితే అంతకుముందు టిఆర్ఎస్ ఎంపీల వాదనపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు.ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలని ఆయన కోరారు.

రెండు రాష్ట్రాలు తమ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడ సహయం చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

English summary
TRS MP AP Jithender Reddy demanded that separate high court for Telangana. He was raised this issue in Loksabha on Thursday.Union minister Sujana chowdary also demanded to fulfill promises as per act to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X